కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిపై అసత్య ప్రచారాలు చేస్తే తీవ్ర పరిణామాలు: కాంగ్రెస్ నేతల హెచ్చరిక
కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిపై అసత్య ప్రచారాలు చేస్తే తీవ్ర పరిణామాలు: కాంగ్రెస్ నేతల హెచ్చరిక
K.RAVI
మునుగోడు అభివృద్ధి ప్రదాత, అవినీతి మచ్చలేని నాయకుడు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, నియోజకవర్గ కాంగ్రెస్ నాయకుడు పబ్బు రాజు గౌడ్‌పై సోషల్ మీడియాలో జరుగుతున్న నిరాధార, అసత్య ప్రచారాలను కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండించింది. శుక్రవారం చౌటుప్పల్ పట్టణంలోని ఎమ్మెల్యే వ్యక్తిగత క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్‌లో కాంగ్రెస్ ముఖ్య నాయకులు మాట్లాడారు.
రాజగోపాల్ రెడ్డిని రాజకీయంగా ఎదుర్కొనే దమ్ము, ధైర్యం లేకనే బిఆర్ఎస్ నాయకులు ఇలాంటి దిగజారుడు రాజకీయాలకు పాల్పడుతున్నారని మండిపడ్డారు.ఒక బీసీ బిడ్డ కష్టపడి, ఆర్థికంగా బలపడి సొంతంగా కారు కొనుక్కుంటే కూడా ఓర్వలేకపోతున్న బిఆర్ఎస్ నాయకుల కుటిల బుద్ధిని ప్రజలు గమనిస్తున్నారని నేతలు ఎద్దేవా చేశారు."పచ్చ కామెర్లు వచ్చినోడికి లోకమంతా పచ్చగా కనిపించినట్లు... గత బిఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో అవినీతి, అక్రమాలకు పాల్పడి డబ్బే పరమావధిగా బతికిన వారికి, తాము కష్టపడి సంపాదించుకున్న సొమ్ము కూడా అవినీతిలాగే కనిపిస్తుండటంలో ఆశ్చర్యం లేదు."తామంతా నిక్కచ్చైన, నిజాయితీ గల నాయకుడు రాజగోపాల్ రెడ్డి నాయకత్వంలో పనిచేస్తున్నామని, తమ పార్టీలో, మునుగోడు నియోజకవర్గంలో గానీ అవినీతికి తావులేదని స్పష్టం చేశారు. ఒకవేళ తమపై వస్తున్న ఆరోపణలకు సంబంధించి బిఆర్ఎస్ నేతల వద్ద ఏవైనా ఆధారాలు ఉంటే బహిరంగ చర్చకు రావాలని సవాల్ విసిరారు.
'పింక్ మీడియా'పై ఆగ్రహం
బిఆర్ఎస్ పార్టీ, వారి 'పింక్ మీడియా' కలిసి ఎన్ని అసత్య ప్రచారాలు చేసినా తెలంగాణ సమాజానికి, మునుగోడు ప్రజలకు రాజగోపాల్ రెడ్డి విలువ ఏంటో బాగా తెలుసని నేతలు పేర్కొన్నారు. ఇకనైనా పెయిడ్ ఛానళ్లు, పెయిడ్ సోషల్ మీడియా అకౌంట్ల ద్వారా తప్పుడు వార్తలు ప్రచారం చేస్తే బిఆర్ఎస్ నాయకులు తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు.ఈ సమావేశంలో వ్యవసాయ మార్కెట్ చైర్మన్ ఉబ్బు వెంకటయ్య, మునుగోడు ఎన్నికల సమన్వయకర్త పబ్బు రాజు గౌడ్, వ్యవసాయ మార్కెట్ వైస్ చైర్మన్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు ఆకుల ఇంద్రసేనారెడ్డి, మున్సిపాలిటీ అధ్యక్షులు సుర్వి నర్సింహగౌడ్, మండల అధ్యక్షులు బోయ దేవేందర్, మున్సిపాలిటీ మాజీ అధ్యక్షులు మొగుదాల రమేష్ గౌడ్, మున్సిపాలిటీ వైస్ చైర్మన్ గోశిక వినయ్
కుమార్, కౌన్సిలర్లు, కోఆప్షన్ సభ్యులు, వివిధ గ్రామాల సర్పంచులు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి