Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నేడు సబ్ స్టేషన్ ముట్టడి: బీఆర్ఎస్ అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! బీసీ మహిళలకు బంపర్ అవకాశం.. కుట్టు మెషీన్ దరఖాస్తు గడువు పొడిగింపు సెప్టెంబర్ 30వ హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన న్యాల్కల్‌లో శ్రావణ మాసం చివరి సోమవారం.. రామలింగేశ్వర ఆలయంలో భక్తుల రద్దీ అక్షరమే ఆయుధం… గురువే దారిచూపే దీపం! నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 21, 2026 11:19 PM

సంగారెడ్డి జిల్లా నూతన డీఈఓగా ఆర్. రోహిణి బాధ్యతల స్వీకరణ

03-06-2026 137 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

సంగారెడ్డి జిల్లా నూతన జిల్లా విద్యాశాఖాధికారిగా (డీఈఓ) ఆర్. రోహిణి బుధవారం బాధ్యతలు స్వీకరించారు. హైదరాబాద్‌లో విధులు నిర్వహిస్తున్న ఆమె బదిలీపై సంగారెడ్డి జిల్లాకు వచ్చి అధికారికంగా పదవీ బాధ్యతలు చేపట్టారు. జిల్లా విద్యాశాఖ కార్యాలయంలో అధికారులు, సిబ్బంది ఆమెకు స్వాగతం పలికి శుభాకాంక్షలు తెలిపారు. ఇప్పటి వరకు డీఈఓగా విధులు నిర్వహించిన వెంకటేశ్వర్లు బదిలీపై రంగారెడ్డి జిల్లాకు వెళ్లగా, ఆయన స్థానంలో ఆర్. రోహిణి నియమితులయ్యారు. విద్యా రంగంలో తనకున్న అనుభవంతో జిల్లాలో ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధి, విద్యా ప్రమాణాల పెంపు, విద్యార్థులకు నాణ్యమైన విద్య అందేలా ప్రత్యేక దృష్టి సారించనున్నట్లు తెలిపారు. అలాగే ప్రభుత్వం అమలు చేస్తున్న విద్యా సంక్షేమ కార్యక్రమాలను సమర్థవంతంగా విద్యార్థులకు చేరవేసేందుకు కృషి చేస్తామని పేర్కొన్నారు. ఆమె రాకతో జిల్లాలో విద్యా రంగం మరింత అభివృద్ధి చెందుతుందని అధికారులు, ఉపాధ్యాయ వర్గాలు ఆశాభావం వ్యక్తం చేశాయి.

Sthanikam

సంగారెడ్డి జిల్లా నూతన డీఈఓగా ఆర్. రోహిణి బాధ్యతల స్వీకరణ

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News