Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నేడు సబ్ స్టేషన్ ముట్టడి: బీఆర్ఎస్ అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! బీసీ మహిళలకు బంపర్ అవకాశం.. కుట్టు మెషీన్ దరఖాస్తు గడువు పొడిగింపు సెప్టెంబర్ 30వ హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన న్యాల్కల్‌లో శ్రావణ మాసం చివరి సోమవారం.. రామలింగేశ్వర ఆలయంలో భక్తుల రద్దీ అక్షరమే ఆయుధం… గురువే దారిచూపే దీపం! నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 21, 2026 11:25 PM

ప్రజలకు స్వచ్ఛమైన తాగునీరు అందించడమే లక్ష్యం.. బోరంచలో రూ.95 లక్షల అభివృద్ధి పనుల ప్రారంభం

03-06-2026 65 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

నారాయణఖేడ్ నియోజకవర్గంలోని మానూర్ మండలం బోరంచ గ్రామంలో ప్రజలకు స్వచ్ఛమైన తాగునీటిని అందించాలనే లక్ష్యంతో రూ.95 లక్షల వ్యయంతో చేపట్టనున్న తాగునీటి శుద్ధి కేంద్రం పునరుద్ధరణ పనులకు ఎమ్మెల్యే డాక్టర్ పట్లోళ్ల సంజీవరెడ్డి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో తాగునీటి సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపడం ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని, ప్రజలకు నాణ్యమైన తాగునీరు అందేలా అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. బోరంచతో పాటు పరిసర గ్రామాల ప్రజలకు ఉపయోగపడే ఈ శుద్ధి కేంద్రాన్ని ఆధునిక సౌకర్యాలతో పునరుద్ధరిస్తున్నట్లు పేర్కొన్నారు. పనులను నాణ్యతతో పాటు నిర్ణీత గడువులో పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని అధికారులను ఆదేశించారు.ఎన్నో రోజులుగా ఈ పనుల కోసం ఎదురుచూస్తున్న గ్రామ ప్రజల అవసరాలను గుర్తించి నిధులు మంజూరు చేయించి పనులు ప్రారంభించడం పట్ల గ్రామస్తులు, స్థానిక ప్రజాప్రతినిధులు హర్షం వ్యక్తం చేస్తూ ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ పునరుద్ధరణ పూర్తయితే బోరంచ గ్రామంతో పాటు సమీప ప్రాంతాల ప్రజలకు స్వచ్ఛమైన, సురక్షితమైన తాగునీరు అందుబాటులోకి రానుందని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో పట్లోళ్ల లోకేష్ రెడ్డి, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు భోజీ రెడ్డి,దిగంబర్ రెడ్డి, సిద్ధ రెడ్డి, గ్రామ సర్పంచ్ పంచగామ బీరప్ప, సంజీవ్, గ్రామ ఉపసర్పంచ్ మొల్ల కరిమ్,శివాజీ పాటిల్, ఖరీం, రాజు, అఖిలేష్ రెడ్డి, వెంకటేశం, మల్లయ్య, మతీన్, నర్సింలు, ఆనంద్, సంజీవ రెడ్డి, సర్పంచులు, ఉప సర్పంచులు, ప్రజాప్రతినిధులు, వివిధ శాఖల అధికారులు, నాయకులు, గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Sthanikam

ప్రజలకు స్వచ్ఛమైన తాగునీరు అందించడమే లక్ష్యం.. బోరంచలో రూ.95 లక్షల అభివృద్ధి పనుల ప్రారంభం

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News