Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
బతుకమ్మ పండుగలో చిన్నారుల సందడి.. బహుమతులతో ప్రోత్సహించిన నేషనల్ హ్యూమన్ రైట్స్ దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 06:56 PM

ఆర్టీసీ స్థలంలో సువార్త మహాసభలా? అనుమతులు లేవు.. మతవిద్వేషాలు రెచ్చగొట్టడమే!

24-05-2026 262 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

​ అధికారుల అనుమతి లేకుండా టెంట్లు, మైకులు ఎలా పెడతారు...?

మెజార్టీ ప్రజల మనోభావాలు దెబ్బతీసేలా వ్యవహరిస్తున్నారు

సభలకు వచ్చే వారి వివరాలు సేకరించి, రిజర్వేషన్లు రద్దు చేయాలి: హిందూ సంఘాల నేతల డిమాండ్

చౌటుప్పల్ పట్టణ కేంద్రంలోని బస్ స్టేషన్ ఆర్టీసీ ఖాళీ స్థలంలో ఎలాంటి అనుమతులు లేకుండా సువార్త మహాసభలు నిర్వహించడం మతవిద్వేషాలు రెచ్చగొట్టే విధానమేనని పలువురు హిందూ సంఘాల నేతలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు.​ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ... చర్చి స్థలాలు, స్కూల్ గ్రౌండ్లు ఉన్నప్పటికీ కావాలనే కొందరు బడా నాయకుల ప్రోద్బలంతో ఆర్టీసీ ఖాళీ స్థలంలో ఈ సభలను నిర్వహిస్తున్నారని ఆరోపించారు. స్థానిక రామాలయానికి సరైన స్థలం లేనందున గతంలో సీతారాముల కళ్యాణాన్ని ఇక్కడే నిర్వహించామని, ఇప్పుడు కావాలనే అదే స్థలంలో సువార్త సభల కోసం టెంట్లు, సౌండ్ సిస్టమ్, లైటింగ్ ఏర్పాటు చేసి మెజార్టీ ప్రజలను రెచ్చగొడుతున్నారని మండిపడ్డారు.​

ట్రాఫిక్ ఇబ్బందులు పట్టవా..?

పట్టణంలో ఇప్పటికే రోడ్డు బ్రిడ్జి నిర్మాణం జరుగుతుండటంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, ఇలాంటి సమయంలో ఇక్కడ మహాసభలు నిర్వహిస్తే పరిస్థితి ఏంటని ప్రశ్నించారు. చౌటుప్పల్ మండలం, మున్సిపాలిటీ రికార్డులలో లేని క్రైస్తవులు ఈ సభలకు ఎక్కడి నుండి వస్తున్నారో అధికారులు గమనించాలని కోరారు. బయటి ప్రాంతాల నుండి వచ్చే వారి వివరాలు సేకరించి, వారు అక్రమంగా ఏవైనా రిజర్వేషన్ ఫలాలు పొందుతుంటే వాటిని వెంటనే తొలగించాలని డిమాండ్ చేశారు.

అనుమతులు లేవన్న ఆర్టీసీ అధికారులు:

ఈ విషయమై తాము నార్కట్‌పల్లి ఆర్టీసీ డీఎం, నల్గొండ ఆర్‌ఎమ్‌లను ఫోన్ ద్వారా సంప్రదించగా... తాము సభలకు ఎలాంటి పర్మిషన్లు ఇవ్వలేదని స్పష్టం చేశారని నేతలు తెలిపారు. అధికారుల అనుమతి లేకుండా ఇక్కడ సభలు ఎలా నిర్వహిస్తారని, ఇదే విధంగా అన్ని మతాల వారు ఎలాంటి పర్మిషన్లు లేకుండా ఈ స్థలాన్ని వాడుకోవచ్చా? అని నిలదీశారు. పోలీసు, రెవెన్యూ, ఆర్టీసీ, ఎలక్ట్రిసిటీ, ఆర్‌అండ్‌బీ, మున్సిపల్ అధికారులు స్పందించి, ఇక్కడ జరుగుతున్న సభలపై పునరాలోచించాలని కోరారు.ఈ కార్యక్రమంలో

దూడల భిక్షం గౌడ్, దిండు భాస్కర్, కడారి ఐలయ్య, వంగాల రమాకాంత్, సప్పిడి లింగారెడ్డి, బక్కనగారి రోహిత్, పల్చం కిషోర్ తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

ఆర్టీసీ స్థలంలో సువార్త మహాసభలా? అనుమతులు లేవు.. మతవిద్వేషాలు రెచ్చగొట్టడమే!

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News