Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
కురుమర్తిలో 100 ఎకరాల్లో ఎండిన పంటలు! ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 15, 2026 03:05 PM

రైతు చెమట చుక్క వృథా కాకూడదు – ఎమ్మెల్యే చింత ప్రభాకర్

22-05-2026 281 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

సదాశివపేట పట్టణంలో డీసీఎంఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన జొన్నల కొనుగోలు కేంద్రాన్ని సంగారెడ్డి ఎమ్మెల్యే చింత ప్రభాకర్ ప్రారంభించారు. అనంతరం రైతులతో కలిసి కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించిన ఆయన ప్రభుత్వ తీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. రైతులు పంటను మార్కెట్‌కు తీసుకొచ్చి రోజుల తరబడి ఎదురు చూడాల్సిన పరిస్థితి దారుణమన్నారు. ఇటీవల జిల్లా కలెక్టర్‌తో సమావేశమై వెంటనే కొనుగోలు కేంద్రాలు ప్రారంభించాలని కోరిన విషయాన్ని గుర్తు చేస్తూ, సదాశివపేట పరిధిలో 4 వేల 693 ఎకరాల్లో జొన్న పంట సాగు జరిగిందని, ఒక ఎకరానికి 30 నుంచి 35 క్వింటాళ్ల వరకు దిగుబడి వస్తోందని తెలిపారు. అయితే ప్రభుత్వం పరిమిత క్వింటాళ్లనే కొనుగోలు చేయడంతో రైతులు నష్టపోతున్నారని విమర్శించారు. కనీసం ఎకరానికి 20 క్వింటాళ్ల వరకు ఎలాంటి ఆంక్షలు లేకుండా కొనుగోలు చేయాలని రైతులు కోరుతున్నారని పేర్కొన్నారు.ప్రభుత్వ పరిమితుల కారణంగా రైతులు బయట మార్కెట్‌లో తక్కువ ధరలకు జొన్నలను అమ్ముకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. “పండించేది రైతు… లాభపడేది దళారులా?” అంటూ ప్రభుత్వ విధానాలపై మండిపడ్డారు. అకాల వర్షాల వల్ల రైతుల ధాన్యం తడిసి నష్టపోయే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తూ, వెంటనే తార్పాలిన్లు, గన్నీ బ్యాగులు, తూకం యంత్రాలు, షెడ్లు వంటి సౌకర్యాలు కల్పించాలని అధికారులను డిమాండ్ చేశారు. రైతు చెమట చుక్క వృథా కాకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని సూచించారు. రైతుల సమస్యలను వెంటనే పరిష్కరించకపోతే కాంగ్రెస్ పార్టీ రైతుల తరఫున పెద్ద ఎత్తున పోరాటాలు చేపడుతుందని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో టీజీఐఐసీ చైర్‌పర్సన్ నిర్మల జగ్గారెడ్డి, మున్సిపల్ ప్రజాప్రతినిధులు, రైతు నాయకులు, రైతులు తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

రైతు చెమట చుక్క వృథా కాకూడదు – ఎమ్మెల్యే చింత ప్రభాకర్

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News