Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మున్సిపల్ కార్మికుడి కుటుంబానికి రూ.10 వేల ఆర్థిక సాయం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 02:28 PM

మూడు డీసీఎంలు ఢీకొని బీభత్సం.. కాపరి మృతి, 300కు పైగా గొర్రెలు మృతి

03-06-2026 73 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Komidala Mahender reddy

నల్లగొండ జిల్లా డిండి మండలం ఎర్రగుంటపల్లి వద్ద జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. ఒకదానికొకటి వెనుక నుంచి మూడు డీసీఎం వాహనాలు బలంగా ఢీకొనడంతో గొర్రెల కాపరి మృతి చెందగా, 300కు పైగా గొర్రెలు ప్రాణాలు కోల్పోయాయి. ఈ దుర్ఘటనతో బాధిత కుటుంబం మాత్రమే కాకుండా యాదవ, కురుమ వర్గాల్లో తీవ్ర ఆవేదన నెలకొంది.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, నాగర్‌కర్నూల్ జిల్లా కొల్లాపూర్ నియోజకవర్గంలోని కోడేరు మండల కేంద్రానికి చెందిన గొర్రెల కాపరి ఎగ్గెంశెట్టి ఎల్లయ్య తన కుటుంబ సభ్యులు, ఇతర కాపరులతో కలిసి ఆంధ్ర ప్రాంతంలో గొర్రెలను మేపుకొని మూడు డీసీఎం వాహనాల్లో స్వగ్రామానికి తిరుగు ప్రయాణం అవుతున్నారు. ఈ క్రమంలో ఎర్రగుంటపల్లి సమీపంలో వాహనాలు అదుపుతప్పి ఒకదానికొకటి ఢీకొన్నాయి.ఈ ప్రమాదంలో ఎల్లయ్య అక్కడికక్కడే మృతి చెందగా, ఆయన భార్య, పిల్లలకు స్వల్ప గాయాలయ్యాయి. వాహనాల్లో తరలిస్తున్న 300కు పైగా గొర్రెలు మృతి చెందడంతో ప్రమాద స్థలం హృదయ విదారకంగా మారింది. రోడ్డుపై చెల్లాచెదురుగా పడి ఉన్న గొర్రెల మృతదేహాలు స్థానికులను కలచివేశాయి.సమాచారం అందుకున్న వెంటనే ఎమ్మెల్యేలు బాలునాయక్, బీర్ల ఐలయ్య, గొర్రెల పెంపకదారుల కార్పొరేషన్ చైర్మన్ సరిత, కురుమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఎగ్గే మల్లేష్ తదితరులు ఘటనాస్థలానికి చేరుకుని పరిస్థితిని పరిశీలించారు. అనంతరం దేవరకొండ ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లి మృతుడు ఎల్లయ్య కుటుంబ సభ్యులను పరామర్శించి ధైర్యం చెప్పారు.ఈ సందర్భంగా కురుమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఎగ్గే మల్లేష్ బాధిత కుటుంబానికి సంఘం తరఫున తక్షణ సాయంగా రూ.1 లక్ష ఆర్థిక సహాయం అందజేస్తామని ప్రకటించారు. ఎమ్మెల్యేలు బాలునాయక్, బీర్ల ఐలయ్య మాట్లాడుతూ బాధిత కుటుంబానికి ప్రభుత్వం నుంచి గరిష్ట స్థాయిలో సహాయం అందించేందుకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. గొర్రెలను కోల్పోయి తీవ్ర నష్టపోయిన యాదవ, కురుమ కుటుంబాలకు అండగా నిలుస్తామని భరోసా ఇచ్చారు.ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు చేపట్టారు. ఒకే ప్రమాదంలో ఓ కుటుంబానికి ఆధారమైన వ్యక్తి ప్రాణాలు కోల్పోవడం, వందలాది గొర్రెలు మృతి చెందడం స్థానికంగా తీవ్ర విషాదాన్ని మిగిల్చింది.

Sthanikam

మూడు డీసీఎంలు ఢీకొని బీభత్సం.. కాపరి మృతి, 300కు పైగా గొర్రెలు మృతి

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News