Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
బాలెంల స్టేజ్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 16, 2026 02:34 PM

సంకినేని చూడమ్మా ఆశయాలను కొనసాగిస్తాం;మల్లు నాగార్జున రెడ్డి సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి

03-06-2026 20 Views
Reporter
స్థానికం ప్రతినిధి : thungathurthi
Bandi Kiran Kumar

సంకినేని హనుమంతరావు సతీమణి సంకినేని చూడమ్మా ఆశయాలను కొనసాగిస్తామని ఆమె భౌతికంగా మనకు దూరమైన ఆమె ఆశయాలు సిపిఎం పార్టీ కొనసాగిస్తుందని సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి మల్లు నాగార్జున రెడ్డి అన్నారు. బుధవారం తుంగతుర్తి మండల కేంద్రంలోని ప్రముఖ సిపిఎం పార్టీ నాయకుడు మాజీ ఉపసర్పంచి సంకినేని హనుమంతరావు గారి సతీమణి అయిన సంకినేని చూడమ్మ కాలం చేసిన సందర్భంగా ఆమె పార్థివ దేహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... సంకినేని హనుమంతరావు ఒక ఉన్నతమైన కుటుంబంలో పుట్టినప్పటికీ నాడు భూస్వామ్య వ్యవస్థలో కార్మికులు పేద ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను స్వయంగా చూసి వారి బాగోగులను గూర్చి ఆలోచించిన మంచి మనస్తత్వం కలిగిన వ్యక్తిగా తుంగతుర్తి ప్రజల మన్నలను పొందాడు సిపిఎం పార్టీలో పనిచేస్తూ తుంగతుర్తి మండల కేంద్రంలో తాను ఒక సందర్భంలో గ్రామ ఉపసర్పంచ్ గా అన్ని వర్గాల ప్రజల మేలు కోసం ఈ గ్రామ అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేసిన మహనీయుడు ఆయన చేస్తున్న మంచి పనులకు అతని భార్య అయిన చూడమ్మా ప్రోత్సాహనిస్తూ పేద ప్రజలకు చేదోడు వాదోడుగా చేతనైనంత సహాయం చేస్తూ ప్రజల మన్నలనుఆమె పొందిందని అన్నారు ఒక అగ్రకులంలో పుట్టినప్పటికీ పేద ప్రజల బాగుకోసం కృషి చేసే మనస్తత్వం గల మంచి మనిషి ఆమె మనకు దూరం అవడం బాధాకరమని ఆమె సేవలను కొనియాడారు నమ్మిన సిద్ధాంతం మీద నిలబడుతూ కమ్యూనిస్టు అభిమానిగా తాను కోరుకున్నట్లు ప్రజలందరూ సమానంగా ఉండాలని కులమత బేధాలు లేకుండా ప్రజలందరూ కలిసిమెలిసి ఉండాలని గ్రామం లోని ప్రజల ఔన్నత్యం కోసం నిరంతరం తాపత్రయంబడే వ్యక్తి మనకు దూరం అవడం బాధాకరమని ఆమె భౌతికంగా లేకపోయినా ఆమెలో ఉన్న మంచితనాన్ని ప్రజల పట్ల ఉన్న మమకారాన్ని ఆమె ఆశయాలను ముందుకు తీసుక పోవుటకు సిపిఎం పార్టీ కృషి చేస్తుందని ఆయన అన్నారు తదనంతరం పార్టీ నాయకత్వం ఘనంగా నివాళులర్పించడం జరిగింది ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యుడు కొలిశెట్టి యాదగిరిరావు సిపిఎం పార్టీ జిల్లా కమిటీ సభ్యులు బుర్ర శ్రీనివాసు కందాల శంకర్ రెడ్డి నాయకులు పల్లా సుదర్శన్ ఓరుగంటి అంతయ్య ముత్తయ్య ఎల్లయ్య ఉప్పుల సోమయ్య యాదగిరి గుడిపాటి వెంకయ్య చంద్రయ్య మాజీ జెడ్పిటిసి తాటి విజయమ్మ పాల్గొన్నారు.

Sthanikam

సంకినేని చూడమ్మా ఆశయాలను కొనసాగిస్తాం;మల్లు నాగార్జున రెడ్డి సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News