Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నేడు సబ్ స్టేషన్ ముట్టడి: బీఆర్ఎస్ అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! బీసీ మహిళలకు బంపర్ అవకాశం.. కుట్టు మెషీన్ దరఖాస్తు గడువు పొడిగింపు సెప్టెంబర్ 30వ హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన న్యాల్కల్‌లో శ్రావణ మాసం చివరి సోమవారం.. రామలింగేశ్వర ఆలయంలో భక్తుల రద్దీ అక్షరమే ఆయుధం… గురువే దారిచూపే దీపం! నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 21, 2026 11:23 PM

గ్రామాభివృద్ధికి సమిష్టి కృషి.. మహాదేవ్‌పల్లి గ్రామ సంఘం కొత్త కార్యవర్గం ఎంపిక

03-06-2026 73 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

నారాయణఖేడ్ నియోజకవర్గంలోని కల్హేర్ మండల పరిధిలోని మహాదేవ్‌పల్లి గ్రామంలో గ్రామ సమాఖ్య సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కల్హేర్ మండల సమాఖ్య ఏపీఎం వంశీకృష్ణ ముఖ్య అతిథిగా హాజరై గ్రామ సమాఖ్యలు మహిళల ఆర్థికాభివృద్ధి, స్వయం ఉపాధి అవకాశాల పెంపు, ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలులో కీలక పాత్ర పోషిస్తున్నాయని తెలిపారు. అనంతరం మహాదేవ్‌పల్లి గ్రామ సంఘానికి నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకోగా, అధ్యక్షురాలిగా గులాపల్లి లక్ష్మీ, కార్యదర్శిగా గుల మోగులవ్వ, కోశాధికారిగా గులాపల్లి అనిత, ఉపాధ్యక్షురాలిగా బైండ్ల కృష్ణవేణి, ఉప కార్యదర్శిగా చిన్నం మంజుల బాధ్యతలు చేపట్టారు. నూతన కార్యవర్గ సభ్యులను అభినందించిన వంశీకృష్ణ గ్రామ సంఘం అభివృద్ధితో పాటు మహిళల సంక్షేమం, స్వయం సహాయక సంఘాల బలోపేతానికి కృషి చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సీసీ బేబీ, గ్రామ స్థాయి బాధ్యుడు బాలయ్య, గ్రామ సంఘం ఈసీ సభ్యులు, మహిళా సంఘాల సభ్యులు మరియు గ్రామస్తులు పాల్గొన్నారు. నూతన కార్యవర్గం ఎన్నిక కావడంతో గ్రామ సంఘ సభ్యులు హర్షం వ్యక్తం చేస్తూ ఎన్నికైన సభ్యులకు శుభాకాంక్షలు తెలిపారు.

Sthanikam

గ్రామాభివృద్ధికి సమిష్టి కృషి.. మహాదేవ్‌పల్లి గ్రామ సంఘం కొత్త కార్యవర్గం ఎంపిక

Article Image

నారాయణఖేడ్ నియోజకవర్గంలోని కల్హేర్ మండల పరిధిలోని మహాదేవ్‌పల్లి గ్రామంలో గ్రామ సమాఖ్య సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కల్హేర్ మండల సమాఖ్య ఏపీఎం వంశీకృష్ణ ముఖ్య అతిథిగా హాజరై గ్రామ సమాఖ్యలు మహిళల ఆర్థికాభివృద్ధి, స్వయం ఉపాధి అవకాశాల పెంపు, ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలులో కీలక పాత్ర పోషిస్తున్నాయని తెలిపారు. అనంతరం మహాదేవ్‌పల్లి గ్రామ సంఘానికి నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకోగా, అధ్యక్షురాలిగా గులాపల్లి లక్ష్మీ, కార్యదర్శిగా గుల మోగులవ్వ, కోశాధికారిగా గులాపల్లి అనిత, ఉపాధ్యక్షురాలిగా బైండ్ల కృష్ణవేణి, ఉప కార్యదర్శిగా చిన్నం మంజుల బాధ్యతలు చేపట్టారు. నూతన కార్యవర్గ సభ్యులను అభినందించిన వంశీకృష్ణ గ్రామ సంఘం అభివృద్ధితో పాటు మహిళల సంక్షేమం, స్వయం సహాయక సంఘాల బలోపేతానికి కృషి చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సీసీ బేబీ, గ్రామ స్థాయి బాధ్యుడు బాలయ్య, గ్రామ సంఘం ఈసీ సభ్యులు, మహిళా సంఘాల సభ్యులు మరియు గ్రామస్తులు పాల్గొన్నారు. నూతన కార్యవర్గం ఎన్నిక కావడంతో గ్రామ సంఘ సభ్యులు హర్షం వ్యక్తం చేస్తూ ఎన్నికైన సభ్యులకు శుభాకాంక్షలు తెలిపారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News