రామన్నపేట బస్టాండ్ నుంచి వేములకొండకు నూతనంగా ఏర్పాటు చేసిన బస్సు సేవలను ప్రభుత్వ విప్, నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం ప్రారంభించారు. గ్రామీణ ప్రాంత ప్రజల రవాణా ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని ఈ సేవలను అందుబాటులోకి తీసుకొచ్చారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే వేముల వీరేశం మాట్లాడుతూ ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యాలు కల్పించడంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందన్నారు. వేములకొండతో పాటు పరిసర గ్రామాల ప్రజలు, విద్యార్థులు, ఉద్యోగులు, రైతులకు ఈ బస్సు సేవలు ఎంతో ఉపయోగకరంగా ఉంటాయని పేర్కొన్నారు.
ప్రజల అవసరాలకు అనుగుణంగా మరిన్ని రవాణా సౌకర్యాలు కల్పించేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి