Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నేడు సబ్ స్టేషన్ ముట్టడి: బీఆర్ఎస్ అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! బీసీ మహిళలకు బంపర్ అవకాశం.. కుట్టు మెషీన్ దరఖాస్తు గడువు పొడిగింపు సెప్టెంబర్ 30వ హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన న్యాల్కల్‌లో శ్రావణ మాసం చివరి సోమవారం.. రామలింగేశ్వర ఆలయంలో భక్తుల రద్దీ అక్షరమే ఆయుధం… గురువే దారిచూపే దీపం! నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 21, 2026 11:22 PM

108లా ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండే నాయకుడు హరీశ్ రావు

03-06-2026 60 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

మాజీ మంత్రి, బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు హరీశ్ రావు జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని సంగారెడ్డి ఎమ్మెల్యే చింత ప్రభాకర్ ఆధ్వర్యంలో సంగారెడ్డి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం, సదాశివపేటలో సేవా కార్యక్రమాలు నిర్వహించారు.ఈ సందర్భంగా పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి కేక్ కట్ చేసి హరీశ్ రావుకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం రక్తదాన శిబిరాన్ని ప్రారంభించడంతో పాటు సంగారెడ్డి జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పండ్లు పంపిణీ చేసి, ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే చింత ప్రభాకర్ మాట్లాడుతూ హరీశ్ రావు ప్రజల సమస్యల పరిష్కారంలో ఎప్పుడూ ముందుండే నాయకుడని, 108 అంబులెన్స్ సేవలు అత్యవసర సమయంలో ప్రజలకు ఎలా అండగా నిలుస్తాయో, హరీశ్ రావు కూడా ప్రజలకు అదే విధంగా అందుబాటులో ఉంటూ సేవలందిస్తున్నారని అన్నారు. అధికారంలో ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్నా ప్రజా సమస్యలపై నిరంతరం స్పందిస్తూ పనిచేసే నాయకుడు హరీశ్ రావు అని కొనియాడారు. తెలంగాణ అభివృద్ధికి ఆయన చేసిన సేవలు చిరస్మరణీయమని, ప్రజల ఆశీస్సులతో మరెన్నో సంవత్సరాలు ఆయురారోగ్యాలతో ప్రజాసేవలో కొనసాగాలని ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో కాసాల బుచ్చిరెడ్డి, మామిళ్ల రాజేందర్, డాక్టర్ శ్రీహరి, విజేందర్ రెడ్డి, చింత సాయినాథ్, వేణుగోపాలస్వామి, సునీల్ జై, కౌన్సిలర్లు, మండల పార్టీ అధ్యక్షులు, మాజీ ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Sthanikam

108లా ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండే నాయకుడు హరీశ్ రావు

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News