Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మొక్కలు నాటుతూ పర్యావరణ పరిరక్షణకు పిలుపు:గ్రామ సర్పంచ్ ప్రియాంక రాజేందర్ అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 26, 2026 04:50 AM

ఘనంగా గడ్డం యాదగిరి జన్మదిన వేడుకలు.

ఘనంగా గడ్డం యాదగిరి జన్మదిన వేడుకలు.

ఘనంగా గడ్డం యాదగిరి జన్మదిన వేడుకలు.
03-06-2026 27 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

తెలంగాణ ఉద్యమకారుడు, టీపీసీసీ ఎస్సీ సెల్ రాష్ట్ర కార్యదర్శి గడ్డం యాదగిరి 53వ జన్మదిన వేడుకలు ఉద్యమకారుల ఫోరం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఇటీవల ఆయనను టీపీసీసీ ఎస్సీ సెల్ రాష్ట్ర కార్యదర్శిగా నియమించడంతో ఉద్యమకారులు, ప్రజా సంఘాల నాయకులు హర్షం వ్యక్తం చేస్తూ జన్మదిన వేడుకలను ప్రత్యేకంగా నిర్వహించారు.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఉద్యమకారుల ఫోరం రాష్ట్ర ఉపాధ్యక్షులు జోగు అంజన్న గడ్డం యాదగిరిని శాలువాతో సత్కరించి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. రామన్నపేట నియోజకవర్గ సాధన సమితి గౌరవాధ్యక్షులు పోతరాజు శంకరయ్య, అధ్యక్షులు బొడ్డుపల్లి లింగయ్య, విద్యావేత్త ఎస్.కె. చాంద్ తదితరులు మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమంలో గడ్డం యాదగిరి చేసిన సేవలను కొనియాడారు.

తెలంగాణ ఉద్యమం నుంచి సామాజిక న్యాయం కోసం నిరంతరం పోరాడుతూ 57 ఉపకులాల హక్కుల సాధనలో కీలక పాత్ర పోషించిన నాయకుడిగా గడ్డం యాదగిరి గుర్తింపు పొందారని పేర్కొన్నారు. రాష్ట్ర స్థాయిలో ఆయనకు లభించిన బాధ్యతలతో చిందు సామాజిక వర్గానికి మరింత గుర్తింపు లభించిందన్నారు.

కార్యక్రమంలో స్థానికం చీఫ్ ఎడిటర్ కొండ మల్లేశం గౌడ్, లీగల్ సేల్ అడ్వైజర్ ఉద్యమకారుడు కూనూరి శ్రీనివాస్ గౌడ్, కైరం కొండ సంతోష్, ఏలూరు రవి, బాలయ్య, ఆంజనేయులు తదితర ఉద్యమ నాయకులు పాల్గొని గడ్డం యాదగిరికి శుభాకాంక్షలు తెలిపారు.

Sthanikam

ఘనంగా గడ్డం యాదగిరి జన్మదిన వేడుకలు.

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News