Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మొక్కలు నాటుతూ పర్యావరణ పరిరక్షణకు పిలుపు:గ్రామ సర్పంచ్ ప్రియాంక రాజేందర్ అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 26, 2026 04:49 AM

గెస్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం

03-06-2026 240 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

చైతన్యపురి

ఎల్బినగర్ లోని తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల మహిళా న్యాయ కళాశాలలో 2026-27 విద్యా సంవత్సరానికి గెస్ట్ అధ్యాపక పోస్టుల తాత్కాలిక ప్రాతిపదికన భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుండి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు సరూర్ నగర్ జోన్ - 6 అధికారి భీమయ్య మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. గెస్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్ (లా) 6 పోస్టులు, గెస్ట్ డిగ్రీ లెక్చరర్ ఇంగ్లీష్ 1 పోస్టు, గెస్ట్ లైబ్రేరియన్ 1 పోస్టులు ఖాళీగా ఉన్నాయని పేర్కొన్నారు. అసిస్టెంట్ ప్రొఫెసర్ కు ఏదైనా స్పెషలైజేషన్‌లో ఎల్ఎల్ఎంలో కనీసం 55 శాతం మార్కులతో పాటు యుజిసి-నెట్ /పిహెచ్ డి వారికి ప్రాధాన్యత, డిగ్రీ లెక్చరర్ ఇంగ్లీష్ కు ఎంఏ ఇంగ్లీష్ యుజిసి -నెట్ ఉన్నవారికి ప్రాధాన్యత, లైబ్రేరియన్ కు ఎంఎల్ఐఎస్సి ప్రాధాన్యత ఉండాలని తెలిపారు. ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఈ నెల 4 నుండి 14 లోపు తమ అప్‌డేట్ చేసిన సివి అన్ని ఒరిజినల్ విద్యార్హత సర్టిఫికెట్ల స్కాన్ కాపీలు, పాస్‌పోర్ట్ సైజ్ ఫోటోతో క్రింది మెయిల్‌కు పంపాలని సూచించారు.

Email prl-rdcw-lbngr-swrs@telangana.gov.in ఇతర వివరాలకు ఫోన్ నంబర్ 9603617134 లో సంప్రదించాలని కోరారు. షార్ట్‌లిస్ట్ చేసిన అభ్యర్థులకు డెమో క్లాస్ నిర్వహించబడుతుందని డెమో క్లాస్‌లోని ప్రతిభ ఆధారంగానే తుది ఎంపిక జరుగుతుందని వివరించారు. ఇతర వివరాలకు

తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల మహిళా న్యాయ కళాశాల చైతన్యపురి మెట్రో స్టేషన్, పిల్లర్ నం. 1570, బస్ స్టాండ్ వెనుక సర్వీస్ రోడ్ లోని తమ కళాశాలలో సంప్రదించవచ్చునని భీమయ్య సూచించారు.

Sthanikam

గెస్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News