Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
చిన్న కోతలతోనే ఛాతీ శస్త్రచికిత్సలు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 11:52 AM

రొద్దం మండల కేంద్రంలో నీటి లీకేజీ సమస్యపై ఆగ్రహం

04-06-2026 23 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Penukonda
EDIGA NAVEENKUMAR

శ్రీ సత్యసాయి జిల్లా రొద్దం మండల కేంద్రంలో నీటి పైపుల లీకేజీ సమస్య రోజురోజుకు తీవ్రరూపం దాలుస్తున్నప్పటికీ అధికారులు పట్టించుకోవడం లేదని బీజేపీ జిల్లా కార్యదర్శి నీరుగంటి వేణుగోపాల్ ఆరోపించారు. గ్రామం నడిబొడ్డున ప్రతిరోజూ నీటి పైపుల ద్వారా నీరు వృథాగా లీకవుతోందని, ఎన్నిసార్లు అధికారుల దృష్టికి తీసుకెళ్లినా స్పందన లేకపోవడం బాధాకరమన్నారు.

మండల ఎంపీడీవోతో పాటు సంబంధిత అధికారులు సమస్యను పరిశీలించడానికి కూడా రాకపోవడం నిర్లక్ష్యానికి నిదర్శనమని విమర్శించారు. రాష్ట్ర మంత్రి సవితమ్మ ఆదేశాలను కూడా రొద్దం మండల అధికారులు బేఖాతరు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

కూటమి ప్రభుత్వంలో పనిచేస్తున్న అధికారులు ప్రజా సమస్యలపై బాధ్యతగా వ్యవహరించాలని, వెంటనే ఘటన స్థలానికి చేరుకుని నీటి లీకేజీ సమస్యను శాశ్వతంగా పరిష్కరించాలని నీరుగంటి వేణుగోపాల్ డిమాండ్ చేశారు.

Sthanikam

రొద్దం మండల కేంద్రంలో నీటి లీకేజీ సమస్యపై ఆగ్రహం

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News