,రామన్నపేట : గాలి దుమారం రావడంతో ట్రాన్స్ ఫార్మర్ మెయిన్ వైరు తెగి పాడి గేదె మృతి చెందిన సంఘటన గురువారం చోటుచేస్తుంది. వివరాల ప్రకారం మండలంలోని పల్లివాడ గ్రామానికి చెందిన నాగులంచ శేఖరయ్య తన వ్యవసాయ భూమిలో గేదెలను మేపుతుండగా అకస్మాత్తుగా గాలి దుమారం రావడంతో ప్రమాదవశాత్తు పక్కనే ఉన్న ట్రాన్స్ఫార్మర్ మెయిన్ వైర్ తెగి గేదెపై పడడంతో గేదె అక్కడికక్కడే మృతి చెందిందని రైతు తెలిపారు. విద్యుత్ అధికారులు
సంఘటన స్థలాన్ని పరిశీలించినట్లు తెలిపారు. పాడి గేదే ఖరీదు దాదాపు లక్ష రూపాయలు ఉంటుందని, ప్రభుత్వం తనకు న్యాయం చేయాలని రైతు కోరారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి