Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
కాంగ్రెస్ నేతల అరెస్టు అప్రజాస్వామికం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 11:30 AM

ఉద్యోగుల హక్కుల కోసం పోరాడిన భిక్షమయ్యకు ఘన వీడ్కోలు

04-06-2026 34 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

నల్గొండ, : ఉద్యోగుల హక్కుల పరిరక్షణ, సంక్షేమం కోసం మూడు దశాబ్దాలకుపైగా సేవలందించిన తెలంగాణ నాలుగవ తరగతి ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడు ఏనుగుల భిక్షమయ్య పదవీ విరమణ సభ బుధవారం నల్గొండలోని టీఎన్‌జీఓఎస్ జిల్లా భవనంలో ఘనంగా నిర్వహించారు. జిల్లా జేఏసీ చైర్మన్ నాగిళ్ల మురళి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి రాష్ట్ర, జిల్లా స్థాయి ఉద్యోగ సంఘాల నాయకులు, అధికారులు, ఉద్యోగులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.

ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా పాల్గొన్న తెలంగాణ రాష్ట్ర నాలుగవ తరగతి ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు దాస్య నాయక్ మాట్లాడుతూ, భిక్షమయ్య ఉద్యోగుల సమస్యల పరిష్కారం, హక్కుల సాధన కోసం నిరంతరం కృషి చేశారని కొనియాడారు. సంఘ బలోపేతానికి ఆయన అందించిన సేవలు చిరస్మరణీయమని పేర్కొన్నారు.

జిల్లా టిబి కంట్రోల్ ఆఫీసర్ డాక్టర్ కల్యాణ్ చక్రవర్తి, బీసీ వెల్ఫేర్ ఆఫీసర్ డాక్టర్ సంజీవయ్య, డాక్టర్ రవి ప్రసాద్, డీటీడీవో, ట్రైబల్ వెల్ఫేర్ శాఖ అధికారులు మాట్లాడుతూ, 35 సంవత్సరాల పాటు ఆఫీస్ సబార్డినేట్‌గా విధులు నిర్వర్తిస్తూ ఉద్యోగులకు అండగా నిలిచిన భిక్షమయ్య సేవలను ప్రశంసించారు.

అనంతరం భిక్షమయ్యను ఘనంగా సన్మానించి శాలువాతో సత్కరించారు. తన ఉద్యోగ జీవితంలో సహకరించిన అధికారులు, సహోద్యోగులు, సంఘ నాయకులకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.

కార్యక్రమంలో టీఎన్‌జీఓఎస్ నాయకులు మనోజ్ ప్రదీప్, లక్ష్మయ్య, ప్రణాదేవి, సత్యనారాయణ, అంజనేయులు, రమ్యసుధ, సుమలత, డీఐ రాజు, జయరావు, భాస్కర్ పాల్గొన్నారు. అలాగే ఐఎన్‌టీయూసీ నాయకుడు బిక్షం, తెలంగాణ నాలుగవ తరగతి ఉద్యోగుల సంఘం నాయకులు మణికుమార్, రాజమల్లయ్య, రాజయ్య, వెంకన్న, సుశీల, రేణుక తదితరులు హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

Sthanikam

ఉద్యోగుల హక్కుల కోసం పోరాడిన భిక్షమయ్యకు ఘన వీడ్కోలు

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News