Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
కాంగ్రెస్ నేతల అరెస్టు అప్రజాస్వామికం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 11:27 AM

ఈదురుగాలుల ధాటికి ధ్వంసమైన సోలార్ పలకలు. 7 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తికి గండి.

04-06-2026 147 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

దెబ్బతిన్న సోలార్ టేబుళ్లు, ప్యానెల్లు

మామిడి తోటలో కరెంటు స్తంభాలు నేల కోరిగాయి.

యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండలం ఉత్తటూర్ గ్రామం శివారులో సోలార్ విద్యుత్ ప్లాంట్‌కు ఇటీవల వీచిన ఈదురుగాలులు భారీ నష్టం మిగిల్చాయి. 2021లో 120 ఎకరాల విస్తీర్ణంలో ఏర్పాటు చేసిన ఈ ప్లాంట్‌లో 230 టేబుళ్ల ద్వారా 15 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేసి రామన్నపేట 132/33 కేవీ సబ్‌స్టేషన్‌కు సరఫరా చేస్తున్నారు. అయితే ఇటీవల సంభవించిన బలమైన గాలులకు ప్లాంట్‌లోని పలుచోట్ల సోలార్ టేబుళ్లు, ప్యానెల్లు ధ్వంసమయ్యాయి.

ప్రాథమిక అంచనాల ప్రకారం ప్లాంట్‌లో సుమారు 50 శాతం మేర నష్టం వాటిల్లినట్లు తెలుస్తోంది. దీంతో 7 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం దెబ్బతిన్నట్లు అధికారులు పేర్కొన్నారు. గాలుల వేగానికి కొన్ని టేబుళ్లు వంగిపోగా, మరికొన్ని నేలకూలినట్లు సమాచారం. దెబ్బతిన్న ప్యానెళ్ల కారణంగా విద్యుత్ ఉత్పత్తి గణనీయంగా తగ్గింది. చుట్టుపక్కల గ్రామాల్లో వనిపాక ఉత్తటూరు,ఇస్కీల్లా మామిడి తోటలో కరెంటు స్తంభాలు నేల కులాయి.

పునరుద్ధరణకు చర్యలు

నష్టం తీవ్రతపై సాంకేతిక నిపుణులు పరిశీలనలు చేపట్టారు. దెబ్బతిన్న పరికరాల మరమ్మతులు, ప్యానెళ్ల మార్పిడి పనులు త్వరలో ప్రారంభించనున్నట్లు యాజమాన్యం తెలిపింది. పూర్తి స్థాయిలో విద్యుత్ ఉత్పత్తి పునరుద్ధరించేందుకు కొంత సమయం పట్టే అవకాశం ఉందని పేర్కొంది. ఈదురుగాలుల కారణంగా సంస్థకు భారీ ఆర్థిక నష్టం సంభవించినట్లు అంచనా వేస్తున్నారు.

Sthanikam

ఈదురుగాలుల ధాటికి ధ్వంసమైన సోలార్ పలకలు. 7 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తికి గండి.

Article Image

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News