Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
కాంగ్రెస్ నేతల అరెస్టు అప్రజాస్వామికం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 11:26 AM

కల్తీ విత్తనాలపై ప్రత్యేక నిఘా: వ్యవసాయ శాఖ

04-06-2026 18 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

ఎర్రుపాలెం: రైతులు తొలకరి సాగుకు సిద్ధమవుతున్న నేపథ్యంలో కల్తీ విత్తనాలు, నకిలీ పురుగుమందుల విక్రయాలను అరికట్టేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టినట్లు వ్యవసాయ శాఖ అధికారులు తెలిపారు. ఇటీవల రైతు సంఘాలు, ప్రజాసంఘాల నాయకులు వ్యక్తం చేసిన ఆందోళనల నేపథ్యంలో విత్తనాలు, ఎరువులు, పురుగుమందుల దుకాణాలపై తనిఖీలు ముమ్మరం చేసినట్లు వెల్లడించారు.

నిబంధనలకు విరుద్ధంగా కల్తీ విత్తనాలు విక్రయించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. రైతులు అధికారిక అనుమతులు ఉన్న డీలర్ల వద్ద నుంచే విత్తనాలు కొనుగోలు చేసి బిల్లులు తప్పనిసరిగా తీసుకోవాలని సూచించారు.

అలాగే రైతుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం చర్యలు చేపడుతోందని, పంటల కొనుగోలు, మద్దతు ధర, పంటల బీమా అంశాలపై సంబంధిత శాఖలతో సమన్వయం కొనసాగుతున్నట్లు పేర్కొన్నారు. కల్తీ విత్తనాల వల్ల రైతులు నష్టపోకుండా అన్ని స్థాయిల్లో పర్యవేక్షణ కొనసాగిస్తామని అధికారులు తెలిపారు.

Sthanikam

కల్తీ విత్తనాలపై ప్రత్యేక నిఘా: వ్యవసాయ శాఖ

Article Image

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News