Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
కేతకీ సంగమేశ్వర స్వామిని దర్శించుకున్న డీసీసీ అధ్యక్షుడు చంద్రశేఖర్ రెడ్డి ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 15, 2026 09:30 PM

పవన్ వ్యాఖ్యలపై ఉద్యమకారుల ఆగ్రహం. తెలంగాణ ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే వ్యాఖ్యలు తగవన్న జోగు అంజన్న

04-06-2026 30 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

హైదరాబాద్

తెలంగాణపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ప్రజలు సహించరని తెలంగాణ ఉద్యమకారుల ఫోరం రాష్ట్ర ఉపాధ్యక్షుడు జోగు అంజన్న హెచ్చరించారు. ఈ మేరకు గురువారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు.

తెలంగాణలో సినీ నటుడు చిరంజీవి కుటుంబానికి ఇప్పటికీ గౌరవం ఉందని, అయితే రాజకీయ నాయకుడిగా బాధ్యతాయుతంగా వ్యవహరించాల్సిన పవన్ కళ్యాణ్ రాష్ట్ర ప్రజల మనోభావాలను దెబ్బతీసే విధంగా మాట్లాడటం సరికాదని పేర్కొన్నారు. ప్రజాస్వామ్యంలో ఎక్కడైనా పోటీ చేసే హక్కు అందరికీ ఉన్నప్పటికీ, తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం, ఉద్యమ చరిత్రపై విమర్శలు చేయడం ఆమోదయోగ్యం కాదన్నారు.

తెలంగాణ సాధన కోసం వేలాది మంది ఉద్యమకారులు పోరాడారని, అమరుల త్యాగాలను ఎవరూ విస్మరించరాదని అన్నారు. రెండు తెలుగు రాష్ట్రాలు సోదరభావంతో ముందుకు సాగుతున్న తరుణంలో రాజకీయ నాయకులు వివాదాస్పద వ్యాఖ్యలతో ప్రజల మధ్య విభేదాలు సృష్టించరాదని సూచించారు.

తెలంగాణ ఆత్మగౌరవం, అస్తిత్వంపై ఎవరైనా అవమానకర వ్యాఖ్యలు చేస్తే ఉద్యమకారులు తగిన విధంగా స్పందిస్తారని జోగు అంజన్న స్పష్టం చేశారు. రాజకీయ నాయకులు హుందాగా వ్యవహరించి ప్రజా సమస్యలపై దృష్టి సారించాలని కోరారు.

Sthanikam

పవన్ వ్యాఖ్యలపై ఉద్యమకారుల ఆగ్రహం. తెలంగాణ ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే వ్యాఖ్యలు తగవన్న జోగు అంజన్న

Article Image

హైదరాబాద్

తెలంగాణపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ప్రజలు సహించరని తెలంగాణ ఉద్యమకారుల ఫోరం రాష్ట్ర ఉపాధ్యక్షుడు జోగు అంజన్న హెచ్చరించారు. ఈ మేరకు గురువారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు.

తెలంగాణలో సినీ నటుడు చిరంజీవి కుటుంబానికి ఇప్పటికీ గౌరవం ఉందని, అయితే రాజకీయ నాయకుడిగా బాధ్యతాయుతంగా వ్యవహరించాల్సిన పవన్ కళ్యాణ్ రాష్ట్ర ప్రజల మనోభావాలను దెబ్బతీసే విధంగా మాట్లాడటం సరికాదని పేర్కొన్నారు. ప్రజాస్వామ్యంలో ఎక్కడైనా పోటీ చేసే హక్కు అందరికీ ఉన్నప్పటికీ, తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం, ఉద్యమ చరిత్రపై విమర్శలు చేయడం ఆమోదయోగ్యం కాదన్నారు.

తెలంగాణ సాధన కోసం వేలాది మంది ఉద్యమకారులు పోరాడారని, అమరుల త్యాగాలను ఎవరూ విస్మరించరాదని అన్నారు. రెండు తెలుగు రాష్ట్రాలు సోదరభావంతో ముందుకు సాగుతున్న తరుణంలో రాజకీయ నాయకులు వివాదాస్పద వ్యాఖ్యలతో ప్రజల మధ్య విభేదాలు సృష్టించరాదని సూచించారు.

తెలంగాణ ఆత్మగౌరవం, అస్తిత్వంపై ఎవరైనా అవమానకర వ్యాఖ్యలు చేస్తే ఉద్యమకారులు తగిన విధంగా స్పందిస్తారని జోగు అంజన్న స్పష్టం చేశారు. రాజకీయ నాయకులు హుందాగా వ్యవహరించి ప్రజా సమస్యలపై దృష్టి సారించాలని కోరారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News