Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
కాంగ్రెస్ నేతల అరెస్టు అప్రజాస్వామికం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 11:27 AM

ధాన్యం కొనుగోళ్లలో జాప్యం వద్దు. ప్రభుత్వ విప్ వేముల వీరేశం

04-06-2026 181 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

రామన్నపేట

రైతులు విక్రయించిన ధాన్యాన్ని కొనుగోలు చేయడంలో ఎలాంటి జాప్యం చోటుచేసుకోకుండా అధికారులు అప్రమత్తంగా వ్యవహరించాలని ప్రభుత్వ విప్, నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం ఆదేశించారు. రామన్నపేట తహసీల్దార్ కార్యాలయంలో ధాన్యం కొనుగోలు ప్రక్రియపై నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు.

కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం నిల్వలు పేరుకుపోకుండా వెంటనే మిల్లులకు తరలించే ఏర్పాట్లు చేయాలని సూచించారు. లారీలు, హమాలీల కొరత కారణంగా రైతులు ఇబ్బందులు పడకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.

రైతులకు అవసరమైన తాగునీరు, నీడ, ఇతర మౌలిక సదుపాయాలు కల్పించాలని సూచించారు. కొనుగోలు కేంద్రాల్లో తలెత్తుతున్న సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించాలని చెప్పారు.

రైతుల ప్రయోజనాల విషయంలో ప్రభుత్వం రాజీ పడదని, వారి ధాన్యానికి సకాలంలో కొనుగోలు, చెల్లింపులు జరిగేలా చర్యలు తీసుకుంటామని వేముల వీరేశం స్పష్టం చేశారు.ఈ సమావేశంలో భువనగిరి రెవిన్యూ జాయింట్ కలెక్టర్ వెంక రెడ్డి , ఆర్డీవో శేఖర్ రెడ్డి, తాసిల్దార్ లాల్ బహుదూర్, ఎస్ ఐ డి నాగరాజు, ఎంపీడీవో రాములు,సంబంధిత శాఖల అధికారులు, వివిధ గ్రామాల సర్పంచులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

ధాన్యం కొనుగోళ్లలో జాప్యం వద్దు. ప్రభుత్వ విప్ వేముల వీరేశం

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News