Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
కాంగ్రెస్ నేతల అరెస్టు అప్రజాస్వామికం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 11:30 AM

తాజ్‌పూర్‌లో గ్రామసభ ప్రజా పాలన–ప్రగతి ప్రణాళికలో భాగంగా నిర్వహణ

04-06-2026 28 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

ప్రజా పాలన–ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంలో భాగంగా తాజ్‌పూర్ గ్రామంలో గురువారం గ్రామసభ నిర్వహించారు. గ్రామ సర్పంచ్ ర్యాకల సంతోష్ శ్రీనివాస్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి జిల్లా పరిషత్ సీఈవో శోభారాణి, ఎంఈవో, వివిధ శాఖల అధికారులు హాజరయ్యారు.

ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ గత ఐదు నెలల కాలంలో గ్రామాభివృద్ధికి పలు కార్యక్రమాలు చేపట్టినట్లు తెలిపారు. గ్రామ పరిశుభ్రత, ప్రజల ఆరోగ్య పరిరక్షణ లక్ష్యంగా స్వంత నిధులతో ప్రతి ఇంటికి తడి, పొడి చెత్త డబ్బాలను పంపిణీ చేసినట్లు చెప్పారు. చెత్త నిర్వహణలో ఆదర్శంగా నిలిచిన ఇద్దరు మహిళలను సభలో సన్మానించారు.

యువత మద్యం, మాదకద్రవ్యాల వంటి చెడు అలవాట్లకు దూరంగా ఉండాలని సూచించారు. గ్రామ ప్రజలకు ఎలాంటి సమస్యలు వచ్చినా నేరుగా సంప్రదించవచ్చని, 24 గంటలు అందుబాటులో ఉంటానని తెలిపారు.

ప్రభుత్వ పాఠశాల అభివృద్ధికి ప్రత్యేక చర్యలు చేపట్టామని, మెరుగైన వసతులు, సౌకర్యాలు కల్పించి ప్రైవేట్ పాఠశాలలకు దీటుగా తీర్చిదిద్దినట్లు పేర్కొన్నారు. తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించాలని కోరారు.

కార్యక్రమంలో సామాజికవేత్త డా. ర్యాకల శ్రీనివాస్, పంచాయతీ కార్యదర్శి, పాలకవర్గ సభ్యులు, వివిధ రాజకీయ పార్టీల నాయకులు, యువజన నాయకులు, గ్రామస్తులు పాల్గొన్నారు.

Sthanikam

తాజ్‌పూర్‌లో గ్రామసభ ప్రజా పాలన–ప్రగతి ప్రణాళికలో భాగంగా నిర్వహణ

Article Image

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News