Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
బతుకమ్మ పండుగలో చిన్నారుల సందడి.. బహుమతులతో ప్రోత్సహించిన నేషనల్ హ్యూమన్ రైట్స్ దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 06:53 PM

వార్డు ప్రజల తాగునీటి కష్టాలకు చెక్!

వార్డు ప్రజల తాగునీటి కష్టాలకు చెక్!

వార్డు ప్రజల తాగునీటి కష్టాలకు చెక్!
04-06-2026 196 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

* రూ. లక్షలతో ఆర్‌ఓ ప్లాంట్ మరమ్మతు పనులు ప్రారంభం

​* త్వరలోనే శుద్ధజలం అందిస్తాం: కౌన్సిలర్ బత్తుల వాణి విప్లవ్ కుమార్

రాంనగర్ కాలనీ వార్డు ప్రజల తాగునీటి కష్టాలను తీర్చి, త్వరలోనే ఆర్‌ఓ ఫిల్టర్ ద్వారా స్వచ్ఛమైన తాగునీటిని అందుబాటులోకి తెస్తామని 13వ వార్డు కౌన్సిలర్ బత్తుల వాణి విప్లవ్ కుమార్ అన్నారు. చౌటుప్పల్ మున్సిపల్ కేంద్రం పరిధిలోని 13వ వార్డు రాంనగర్ కాలనీలో గత కొంతకాలంగా నిలిచిపోయిన ఆర్‌ఓ వాటర్ ఫిల్టర్ మరమ్మతు పనులను గురువారం ఆమె అధికారికంగా ప్రారంభించారు.​దివీస్ లాబొరేటరీస్ పరిశ్రమ యాజమాన్యం, చౌటుప్పల్ మున్సిపల్ చైర్‌పర్సన్ మొగుదాల పావని రమేష్ గౌడ్ ల ప్రత్యేక సహకారంతో ఈ పునరుద్ధరణ పనులను చేపట్టారు.​ఈ సందర్భంగా కౌన్సిలర్ బత్తుల వాణి విప్లవ్ కుమార్ మాట్లాడుతూ.. గత కొన్ని సంవత్సరాలుగా ఆర్‌ఓ ఫిల్టర్ పాడైపోయి ఉండటంతో కాలనీవాసులు నీటి కోసం తీవ్ర ఇబ్బందులు పడుతున్న విషయాన్ని తన దృష్టికి తీసుకొచ్చారని తెలిపారు. గతంలో దివీస్ పరిశ్రమ సహకారంతోనే ఈ వాటర్ ఫిల్టర్ నిర్మించినందున, మరమ్మతుల విషయాన్ని కూడా సదరు పరిశ్రమ యాజమాన్యం దృష్టికి తీసుకెళ్లినట్లు వివరించారు. దీనిపై సానుకూలంగా స్పందించిన యాజమాన్యం వెంటనే బోరు, ఫిల్టర్ మరమ్మతు పనులను మంజూరు చేసిందని చెప్పారు.​మరమ్మతుల్లో భాగంగా మొదట బోరు బావిని బాగు చేయించాం. భూగర్భంలో సమృద్ధిగా నీరు ఉండటం సంతోషకరం. యుద్ధప్రాతిపదికన పనులను పూర్తి చేయించి, త్వరలోనే వార్డు ప్రజలందరికీ మంచినీటిని సరఫరా చేస్తాం.పనుల పరిశీలన ​మరమ్మతు పనుల ప్రారంభం అనంతరం కౌన్సిలర్, స్థానిక నాయకులు పనుల నాణ్యతను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో దివీస్ ప్రతినిధి వెంకటేశ్వర్లు, వర్కాల కుమార్ గౌడ్, చెవగోని వెంకటేష్ గౌడ్, మార్గం నర్సింహ్మ యాదవ్, చెరుకు అశోక్ గౌడ్, గుయ్యని జంగయ్య, చెరుకు సాయి గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

వార్డు ప్రజల తాగునీటి కష్టాలకు చెక్!

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News