రాష్ట్రంలోని అన్ని సినిమా థియేటర్ల యాజమాన్యాలు ఆంధ్రప్రదేశ్ ఫిలిం, టెలివిజన్ & థియేటర్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్‌లో తప్పనిసరిగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలని ఆ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ విశ్వనాథన్ ఆదేశించారు.
గురువారం అమరావతి నుంచి జిల్లా జాయింట్ కలెక్టర్లతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో ఆయన మాట్లాడుతూ, కార్పొరేషన్‌కు చెల్లించాల్సిన బకాయిలను వెంటనే చెల్లించడంతో పాటు, థియేటర్లకు సంబంధించిన బి-ఫామ్ లైసెన్సులను గడువు ముగిసేలోపు నిబంధనల ప్రకారం పునరుద్ధరించుకోవాలని సూచించారు.నిబంధనల అమలులో ఎలాంటి నిర్లక్ష్యం ఉండరాదని, జిల్లాల పరిధిలోని థియేటర్లపై జాయింట్ కలెక్టర్లు నిరంతర పర్యవేక్షణ చేపట్టాలని ఆదేశించారు. ఈ సమావేశంలో శ్రీ సత్యసాయి జిల్లా జాయింట్ కలెక్టర్ మౌర్య భరద్వాజ్ పాల్గొన్నారు.















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి