Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
14 ఏళ్ల బాలికలకు టీకా తప్పనిసరి –ఖేఢ్ సబ్ కలెక్టర్ ఉమా హారతి రైతు సేవా కేంద్రాల్లో నమోదు చేసుకోవాలని సూచన: AO సంజీవ్ కుమార్ కష్టమే విజయానికి మార్గం.. వెస్టీజ్‌లో రాణించిన అజ్మీరా శర్వాణ్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు అక్రమ ఇసుక రవాణా టిప్పర్లను సీజ్ చేసిన అధికారులు పార్థివ దేహానికి నివాళులర్పించిన రాష్ట్ర కార్యదర్శి సామకోటి స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: June 05, 2026 05:33 PM

శ్రీ సత్యసాయి జిల్లాలో ఘనంగా ప్రపంచ పర్యావరణ దినోత్సవం

శ్రీ సత్యసాయి జిల్లాలో ఘనంగా ప్రపంచ పర్యావరణ దినోత్సవం

శ్రీ సత్యసాయి జిల్లాలో ఘనంగా ప్రపంచ పర్యావరణ దినోత్సవం
June 05, 2026 02:24 PM 5 Views
Reporter
స్థానికం ప్రతినిధి : శ్రీ సత్యసాయి జిల్లా ఇంచార్జ్
Anjali

ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని శ్రీ సత్యసాయి జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు జిల్లాలో శుక్రవారం భారీ స్థాయిలో మొక్కలు నాటే కార్యక్రమాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించారు.పుట్టపర్తి హెడ్‌క్వార్టర్స్ పరిధిలోని ఎద్దులకొండ వద్ద నిర్వహించిన ప్రధాన కార్యక్రమంలో పుట్టపర్తి ఎమ్మెల్యే, జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీ, ఇతర జిల్లా అధికారులు, ప్రజాప్రతినిధులు, మున్సిపల్ సిబ్బంది మరియు ప్రజలు కలిసి సుమారు 500 మంది పాల్గొన్నారు. ఈ సందర్భంగా అక్కడ 350 నుండి 400 మొక్కలను నాటారు.

జిల్లా వ్యాప్తంగా 159 ప్రాంతాలలో మొక్కలు నాటే కార్యక్రమాలు చేపట్టి, నర్సరీల నుండి దాదాపు 40,000 మొక్కలను తరలించి నాటడం జరిగింది.

ప్రజల భాగస్వామ్యాన్ని పెంపొందించే లక్ష్యంతో 10,000 పండ్ల మరియు ఇతర మొక్కలను ప్రజలకు ఉచితంగా పంపిణీ చేశారు.

సామాజిక వన విభాగం ఆధ్వర్యంలో జిల్లాలో పచ్చదనాన్ని పెంపొందించేందుకు 40,000 సీడ్ బాల్స్ (విత్తన బంతులను) ఎద్దులకొండ పరిసర ప్రాంతాల్లో విస్తరించడం జరిగింది.రాష్ట్రంలో 2047 నాటికి భౌగోళిక విస్తీర్ణంలో 50 శాతం పచ్చదనాన్ని పెంపొందించాలనే లక్ష్య సాధనలో భాగంగా ప్రతి ఒక్కరూ మొక్కల నాటకం, సంరక్షణలో భాగస్వాములు కావాలని కలెక్టర్ పిలుపునిచ్చారు.జిల్లాలో 2030 నాటికి 33 శాతం పచ్చదనాన్ని సాధించేందుకు ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక రూపొందిస్తున్నామని, ఆ లక్ష్య సాధనకు ప్రజలందరూ సహకరించాలని సామాజిక వన విభాగం డివిజనల్ ఫారెస్ట్ ఆఫీసర్ జి. శ్రీనివాసులు విజ్ఞప్తి చేశారు.ప్రస్తుతం సామాజిక వన విభాగం నర్సరీలలో 17 లక్షల మొక్కలు ప్రజలకు పంపిణీ చేయుటకు సిద్ధంగా ఉన్నాయని, వాటిని వినియోగించుకొని శ్రీ సత్యసాయి జిల్లాను హరిత జిల్లాగా తీర్చిదిద్దేందుకు ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని కోరారు.జిల్లాలో పచ్చదనాన్ని మరింత పెంపొందించేందుకు వీబీజీ (VBG RAM G) పథకం ద్వారా సుమారు 60 లక్షల మొక్కలను పెంచే కార్యక్రమం అమలు చేస్తున్నట్లు తెలిపారు. "ప్రతి ఇంటికి ఒక చెట్టు", బ్లాక్ ప్లాంటేషన్లు, అవెన్యూ ప్లాంటేషన్లు మరియు ఇతర హరిత కార్యక్రమాల ద్వారా పర్యావరణ పరిరక్షణకు కృషి చేస్తున్నట్లు వెల్లడించారు.

అదేవిధంగా సామాజిక వన విభాగం ఆధ్వర్యంలో 5 లక్షల సీడ్ బాల్స్ తయారీ లక్ష్యంగా కార్యక్రమం కొనసాగుతోందని తెలిపారు. ఇందులో వేప, వెదురు, రేల, చింత, శ్రీగంధం, రేగు, వెలగ, మారేడు, సీతాఫలం, ఉసిరి, మేడి, జువ్వి, రావి, మర్రి, నేరేడు తదితర వృక్ష జాతుల విత్తనాలతో సీడ్ బాల్స్ తయారు చేస్తున్నట్లు పేర్కొన్నారు."వృక్షో రక్షతి రక్షితః – చెట్లను రక్షిస్తే చెట్లు మనలను రక్షిస్తాయి" అనే సందేశంతో ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి వాటిని సంరక్షించాలని కలెక్టర్ పెర్కొన్నారు.ఈ కార్యక్రమం లో డిఎఫ్ఓ చక్రపాని,డివిజన్ అటవీ అధికారి శ్రీనివాసులు,డిఆర్‌డిఎ పిడి నరసయ్య,డిడబ్ల్యుఎంఏ పిడి విజయ్ ప్రసాద్,జిల్లా అధికారులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News