Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
కాంగ్రెస్ నేతల అరెస్టు అప్రజాస్వామికం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 11:31 AM

సీఎంపై అనుచిత వ్యాఖ్యలు చేసిన వ్యక్తిపై చర్యలు తీసుకోవాలి

05-06-2026 170 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

తెలంగాణ ముఖ్యమంత్రి ఏ . రేవంత్ రెడ్డి పై దేవరకొండ మండలం కొర్ర తండాకు చెందిన జనసేన కార్యకర్త కొర్ర చందు చేసిన అనుచిత వ్యాఖ్యలను ఖండిస్తూ రామన్నపేట మండల యువజన కాంగ్రెస్ నాయకులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. మండల యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు బట్టె సంతోష్ కుమార్ ఆధ్వర్యంలో రామన్నపేట సబ్‌ ఇన్‌స్పెక్టర్‌కు వినతిపత్రం అందజేసి, కొర్ర చందుపై తక్షణమే కేసు నమోదు చేసి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు.

ఈ సందర్భంగా బట్టె సంతోష్ కుమార్ మాట్లాడుతూ, రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేయడం ఖండనీయమన్నారు. ప్రజాప్రతినిధులు, ప్రజా నాయకులపై మాట్లాడేటప్పుడు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని సూచించారు. ఇలాంటి వ్యాఖ్యలను యువజన కాంగ్రెస్ తీవ్రంగా వ్యతిరేకిస్తుందని హెచ్చరించారు.

ఈ కార్యక్రమంలో యువజన కాంగ్రెస్ నకిరేకల్ నియోజకవర్గ ఉపాధ్యక్షుడు పున్న అమరేందర్, మండల ఉపాధ్యక్షులు కేస సాయి, జవ్వాజి శ్రీకాంత్, రుద్రాల విక్కీ సాయి, నవీన్, సురేష్ తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

సీఎంపై అనుచిత వ్యాఖ్యలు చేసిన వ్యక్తిపై చర్యలు తీసుకోవాలి

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News