Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నేడు సబ్ స్టేషన్ ముట్టడి: బీఆర్ఎస్ అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! బీసీ మహిళలకు బంపర్ అవకాశం.. కుట్టు మెషీన్ దరఖాస్తు గడువు పొడిగింపు సెప్టెంబర్ 30వ హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన న్యాల్కల్‌లో శ్రావణ మాసం చివరి సోమవారం.. రామలింగేశ్వర ఆలయంలో భక్తుల రద్దీ అక్షరమే ఆయుధం… గురువే దారిచూపే దీపం! నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 21, 2026 11:21 PM

ప్రజల సౌకర్యమే లక్ష్యం.. బోరంచలో హైటెక్స్ లైట్ల ప్రారంభం

05-06-2026 125 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

నారాయణఖేడ్ నియోజకవర్గంలోని మానూర్ మండల పరిధిలోని బోరంచ గ్రామంలో మొహరం (పీర్ల) పండుగ సందర్భంగా గ్రామంలోని దూదేకుల మసీదు సమీపంలో, పాతాళగడ్డ సంగమేశ్వర ఆలయానికి వెళ్లే మార్గంలో ఏర్పాటు చేసిన హైటెక్స్ లైట్లను గురువారం రాత్రి గ్రామ సర్పంచ్ పంచగామ బీరప్ప, ఉపసర్పంచ్ మొల్ల కరిమ్ చేతుల మీదుగా ప్రారంభించారు. ఎమ్మెల్యే డాక్టర్ పి. సంజీవరెడ్డి, జహీరాబాద్ ఎంపీ సురేష్ కుమార్ షేట్కార్ ఆదేశాల మేరకు ఏర్పాటు చేసిన ఈ లైటింగ్ వల్ల పండుగకు వచ్చే భక్తులు, గ్రామ ప్రజలు రాత్రి వేళల్లో ఎలాంటి ఇబ్బందులు లేకుండా సురక్షితంగా రాకపోకలు సాగించే అవకాశం కలిగింది. ఈ సందర్భంగా గ్రామ ప్రజలు ప్రజాప్రతినిధులకు కృతజ్ఞతలు తెలుపుతూ, ప్రజల సౌకర్యాలను దృష్టిలో ఉంచుకుని చేపట్టిన ఈ కార్యక్రమాన్ని అభినందించారు. కార్యక్రమంలో వార్డు సభ్యులు, గ్రామ పెద్దలు, యువకులు, భక్తులు మరియు గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Sthanikam

ప్రజల సౌకర్యమే లక్ష్యం.. బోరంచలో హైటెక్స్ లైట్ల ప్రారంభం

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News