Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
కొండా లక్ష్మణ్ బాపూజీ వర్ధంతి: ఘనంగా నివాళులర్పించిన ఈఎల్వి భాస్కర్ అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! బీసీ మహిళలకు బంపర్ అవకాశం.. కుట్టు మెషీన్ దరఖాస్తు గడువు పొడిగింపు సెప్టెంబర్ 30వ హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన న్యాల్కల్‌లో శ్రావణ మాసం చివరి సోమవారం.. రామలింగేశ్వర ఆలయంలో భక్తుల రద్దీ అక్షరమే ఆయుధం… గురువే దారిచూపే దీపం! నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 22, 2026 03:05 AM

మొక్కలను నాటడమే కాదు సంరక్షించడం మనందరి బాధ్యత

05-06-2026 17 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Kodada
Harish reporter

పర్యావరణ పరిరక్షణలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని కోదాడ మున్సిపల్ చైర్‌పర్సన్ ఎర్నేని కుసుమ వెంకటరత్నం బాబు పిలుపునిచ్చారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా శుక్రవారం పట్టణంలోని ప్రధాన రహదారిపై డివైడర్ల మధ్య ఉన్న మొక్కలను కాపాడుకునేందుకు మున్సిపల్ ఆధ్వర్యంలో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. మున్సిపల్ వైస్ చైర్మన్, కమిషనర్, కౌన్సిలర్లు, సిబ్బందితో కలిసి చైర్ పర్సన్ స్వయంగా చెట్లకు పాదులు చేసి, ఎరువులు వేసి, నీళ్లు పోశారు.ఈ సందర్భంగా చైర్‌పర్సన్ మాట్లాడుతూ కేవలం మొక్కలను నాటడమే కాకుండా, వాటిని వృక్షాలుగా మార్చే వరకు సంరక్షించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. పర్యావరణ పరిరక్షణలో ప్రజలందరూ భాగస్వాములు కావాలన్నారు. పచ్చని చెట్లతోనే పర్యావరణ సమతుల్యత సాధ్యమవుతుందని పేర్కొంటూ పట్టణ ప్రజలందరికీ పర్యావరణ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ దేవరపల్లి మల్లేశ్వరి, కమిషనర్ రమాదేవి, డి ఈ సాయి లక్ష్మి, కౌన్సిలర్లు ఎలమందల నరసయ్య, గంధం పాండు, మాజీ కౌన్సిలర్ కాజా మొయినుద్దీన్, కాంగ్రెస్ నాయకులు రావెళ్ళ కృష్ణారావు, మైలారి శెట్టి భాస్కర్, ధన మూర్తి, క్షత్రయ్య, మున్సిపల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు........

Sthanikam

మొక్కలను నాటడమే కాదు సంరక్షించడం మనందరి బాధ్యత

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News