Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
కొండా లక్ష్మణ్ బాపూజీ వర్ధంతి: ఘనంగా నివాళులర్పించిన ఈఎల్వి భాస్కర్ అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! బీసీ మహిళలకు బంపర్ అవకాశం.. కుట్టు మెషీన్ దరఖాస్తు గడువు పొడిగింపు సెప్టెంబర్ 30వ హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన న్యాల్కల్‌లో శ్రావణ మాసం చివరి సోమవారం.. రామలింగేశ్వర ఆలయంలో భక్తుల రద్దీ అక్షరమే ఆయుధం… గురువే దారిచూపే దీపం! నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 22, 2026 03:06 AM

పర్యావరణాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి పౌరుడిపై ఉంది.......

05-06-2026 19 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Kodada
Harish reporter

ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని కోదాడ కోర్టు ఆవరణలో శుక్రవారం మండల న్యాయ సేవాధికారి సంస్థ ఆధ్వర్యంలో మొక్కలు నాటే కార్యక్రమం నిర్వహించారు. కోదాడ సబ్ జడ్జి కే. సురేష్ న్యాయమూర్తులు, న్యాయవాదులు కలిసి కోర్టు ప్రాంగణంలో వివిధ రకాల మొక్కలను నాటి నీళ్లు పోశారు.ఈ సందర్భంగా సబ్ జడ్జి కే. సురేష్ మాట్లాడుతూ ప్రస్తుత కాలంలో పర్యావరణాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్క పౌరుడిపై ఉందన్నారు. పర్యావరణాన్ని కాపాడుకోకుంటే భవిష్యత్తులో తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందన్నారు. భవిష్యత్ తరాలకు మనం స్వచ్ఛమైన గాలిని, కలుషితం కాని నీటిని అందించాలంటే నేటి నుంచే పెద్దఎత్తున వృక్షాలను పెంచాల్సిన అవసరం ఉందన్నారు. కేవలం మొక్కలు నాటడమే కాకుండా, అవి పెరిగే వరకు బాధ్యతగా సంరక్షించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి కే. భవ్య, ఫస్ట్ ఏడీఎం జడ్జి మహమ్మద్ ఉమర్ , సెకండ్ ఏడీఎం జడ్జి జాకియా సుల్తానాలతో పాటు బార్ అసోసియేషన్ ఉపాధ్యక్షులు గట్ల నరసింహారావు, కెవి రావు, హేమలత, పెద్దబ్బాయి, తాటి మురళి, ఉయ్యాల నరసయ్య, శరత్ కుమార్, నవీన్ కుమార్, రవీందర్, పారా లీగల్ వాలంటీర్ లు,కోర్ట్ సిబ్బంది పాల్గొన్నారు........

Sthanikam

పర్యావరణాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి పౌరుడిపై ఉంది.......

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News