Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నేడు సబ్ స్టేషన్ ముట్టడి: బీఆర్ఎస్ అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! బీసీ మహిళలకు బంపర్ అవకాశం.. కుట్టు మెషీన్ దరఖాస్తు గడువు పొడిగింపు సెప్టెంబర్ 30వ హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన న్యాల్కల్‌లో శ్రావణ మాసం చివరి సోమవారం.. రామలింగేశ్వర ఆలయంలో భక్తుల రద్దీ అక్షరమే ఆయుధం… గురువే దారిచూపే దీపం! నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 21, 2026 11:21 PM

14 ఏళ్ల బాలికలకు టీకా తప్పనిసరి –ఖేఢ్ సబ్ కలెక్టర్ ఉమా హారతి

05-06-2026 89 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

నారాయణఖేడ్ సబ్ కలెక్టర్ కార్యాలయంలో సబ్ కలెక్టర్ ఎన్. ఉమా హారతి మేడమ్ ఆధ్వర్యంలో గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ నివారణకు సంబంధించిన టీకాపై అవగాహన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా 14 సంవత్సరాలు నిండిన బాలికలకు ప్రభుత్వం అందిస్తున్న టీకాను తప్పనిసరిగా వేయించాలని సూచించారు. ఈ టీకా ద్వారా భవిష్యత్తులో గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ బారిన పడే అవకాశాలు తగ్గుతాయని, బాలికల ఆరోగ్య రక్షణకు ఇది ఎంతో ఉపయోగకరమని వివరించారు. పాఠశాలలు, వైద్య ఆరోగ్య శాఖ, మహిళా సంఘాలు పరస్పర సమన్వయంతో పనిచేసి తల్లిదండ్రులు మరియు విద్యార్థినులకు టీకా ప్రాముఖ్యతను తెలియజేయాలని సూచించారు. ఈ సమావేశంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులు, ప్రభుత్వ ఆసుపత్రి అధికారులు, వివిధ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల వైద్యులు, మండల విద్యాశాఖ అధికారులు, బాలికల పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, ప్రత్యేక అధికారులు, జిల్లా మరియు మండల స్థాయి సిబ్బంది, మహిళా సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు. అర్హులైన ప్రతి బాలికకు టీకా అందేలా చర్యలు తీసుకొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని సమావేశంలో నిర్ణయించారు.

Sthanikam

14 ఏళ్ల బాలికలకు టీకా తప్పనిసరి –ఖేఢ్ సబ్ కలెక్టర్ ఉమా హారతి

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News