Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
బతుకమ్మ పండుగలో చిన్నారుల సందడి.. బహుమతులతో ప్రోత్సహించిన నేషనల్ హ్యూమన్ రైట్స్ దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 06:55 PM

మాదిగలు అన్ని రంగాల్లో అత్యున్నత స్థాయికి ఎదగాలి

05-06-2026 160 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

​ ఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షులు డా. గోవిందు నరేష్ మాదిగ

కాంగ్రెస్ మండల అధ్యక్షుడు బోయ దేవేందర్‌కు సత్కారం

తెలంగాణలో అత్యధిక జనాభా కలిగిన మాదిగలు విద్యా, ఆర్థిక రంగాలతో పాటు రాజకీయంగా అత్యున్నత స్థాయికి ఎదగాలని ఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షులు డా. గోవిందు నరేష్ మాదిగ పిలుపునిచ్చారు. చౌటుప్పల్ మండల కాంగ్రెస్ అధ్యక్షుడిగా వరుసగా రెండోసారి ఎన్నికైన బోయ దేవేందర్‌ను చౌటుప్పల్‌లో ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో శాలువాతో ఘనంగా సత్కరించారు.​ఈ సందర్భంగా డా. నరేష్ మాదిగ మాట్లాడుతూ.. 'పద్మశ్రీ' మందకృష్ణ మాదిగ మూడు దశాబ్దాల పోరాటాల వల్లే మాదిగలకు రాజకీయ గుర్తింపు లభించిందన్నారు. బోయ దేవేందర్ తన క్రమశిక్షణ, సేవాతత్పరతతోనే రెండోసారి అధ్యక్ష పదవిని దక్కించుకున్నారని, వచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ జాతి ఉన్నతికి తోడ్పడాలని ఆకాంక్షించారు.

ఎమ్మార్పీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి బోయ లింగస్వామి మాదిగ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ ఉబ్బు వెంకటయ్య, మాదిగ జర్నలిస్టు ఫోరం రాష్ట్ర నాయకులు ఊదరి వెంకటేష్ మహాజన్, ఎమ్మార్పీఎస్ మండల అధ్యక్షులు బోడ్డు శ్రవణ్ కుమార్, కౌన్సిలర్ చింతల ఉమామహేశ్వరి సాయిలు, ఎస్సీ ఎస్టీ ఉపాధ్యాయ సంఘం జిల్లా అధ్యక్షులు బోయ రాము, మాదిగ జర్నలిస్టు ఫోరం మండల అధ్యక్షులు ఆరుట్ల లింగస్వామి, ఎమ్మార్పీఎస్ మండల సహాయ కార్యదర్శి బొడ్డు గణేష్, ఎమ్మార్పీఎస్ కోయలగూడెం గ్రామ శాఖ అధ్యక్షులు ఊదరి భాస్కర్, బోదుల స్వామి, చెక్క లింగస్వామి, బీసీ సంఘం నాయకులు వీరమల్ల సత్తయ్య, బుడగ జంగాల నాయకులు ప్రభు తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

మాదిగలు అన్ని రంగాల్లో అత్యున్నత స్థాయికి ఎదగాలి

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News