Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
కాంగ్రెస్ నేతల అరెస్టు అప్రజాస్వామికం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 11:29 AM

పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ బాధ్యత వహించాలి

05-06-2026 27 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

నల్గొండ, : ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని డీవైఎఫ్‌ఐ నల్గొండ పట్టణ కమిటీ ఆధ్వర్యంలో 48వ వార్డులోని పార్కులో శుక్రవారం మొక్కల నాటే కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నల్గొండ ఎక్సైజ్ సర్కిల్ ఇన్‌స్పెక్టర్ ప్రసాద్ పాల్గొని మొక్కలు నాటారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పెరుగుతున్న కాలుష్యం, వాతావరణ మార్పుల నేపథ్యంలో ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి వాటిని సంరక్షించాలని సూచించారు. పర్యావరణ సమతుల్యతను కాపాడడంలో మొక్కలు కీలక పాత్ర పోషిస్తాయని తెలిపారు.

డీవైఎఫ్‌ఐ రాష్ట్ర ఉపాధ్యక్షుడు మల్లం మహేష్ మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణలో యువత ముందుండి పనిచేయాలని అన్నారు. మొక్కలు నాటడమే కాకుండా వాటి సంరక్షణ బాధ్యతను కూడా చేపట్టాలని పిలుపునిచ్చారు. పచ్చదనాన్ని పెంపొందించడం ద్వారా భావితరాలకు మెరుగైన భవిష్యత్తు అందించవచ్చని పేర్కొన్నారు.

కార్యక్రమంలో డీవైఎఫ్‌ఐ మాజీ జిల్లా అధ్యక్షుడు కట్ట ప్రభాత్, జిల్లా ఉపాధ్యక్షుడు గుండాల నరేష్, జిల్లా సహాయ కార్యదర్శి కట్ట లింగస్వామి, పట్టణ నాయకులు గద్దపాటి రఘువరన్, బూర్గు గోపికృష్ణ, బోగరి సుకుమార్, కార్తీక్, మాదాసు రావణ్‌, మహేష్ తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ బాధ్యత వహించాలి

Article Image

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News