Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
కాంగ్రెస్ నేతల అరెస్టు అప్రజాస్వామికం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 11:29 AM

శుభదినాన సుబ్రహ్మణ్య స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు

05-06-2026 70 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

భువనగిరి, అధిక జ్యేష్ఠ మాసంలో శనివారం షష్టి తిథి సందర్భంగా సుబ్రహ్మణ్య స్వామి ఆలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు ఆలయ నిర్వాహకులు తెలిపారు.

ఉదయం స్వామివారికి పంచామృతాభిషేకం, తులసీ అర్చన, పుష్పార్చన, కుంకుమార్చన నిర్వహించనున్నట్లు వెల్లడించారు. ఈ పుణ్యదినాన గ్రామ పెద్దలు, మహిళలు, యువత, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించాలని కోరారు.

అనంతరం అన్నప్రసాద వితరణ కార్యక్రమం నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ అన్నదాన కార్యక్రమానికి భువనగిరి గ్రామానికి చెందిన మహేశుని నరేష్ కుటుంబ సభ్యులు అన్నదాతలుగా వ్యవహరిస్తున్నారు. నరేష్ తన 50వ జన్మదినాన్ని పురస్కరించుకుని కుటుంబ సభ్యులతో కలిసి అన్నదాన సేవ చేపట్టనున్నట్లు పేర్కొన్నారు.

ఈ సందర్భంగా మహేశుని నరేష్, వేదవతి, కార్తీక్‌, సాత్విక, తులసమ్మలకు స్వామివారి సంపూర్ణ ఆశీస్సులు లభించాలని భక్తులు ఆకాంక్షించారు.

Sthanikam

శుభదినాన సుబ్రహ్మణ్య స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News