Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ బాధ్యత వహించాలి రైతు సేవా కేంద్రాల్లో నమోదు చేసుకోవాలని సూచన: AO సంజీవ్ కుమార్ కష్టమే విజయానికి మార్గం.. వెస్టీజ్‌లో రాణించిన అజ్మీరా శర్వాణ్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు అక్రమ ఇసుక రవాణా టిప్పర్లను సీజ్ చేసిన అధికారులు పార్థివ దేహానికి నివాళులర్పించిన రాష్ట్ర కార్యదర్శి సామకోటి స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: June 05, 2026 09:34 PM

ప్రజా సంక్షేమమే ధ్యేయంగా మోదీ సుపరిపాలన

ప్రజా సంక్షేమమే ధ్యేయంగా మోదీ సుపరిపాలన

ప్రజా సంక్షేమమే ధ్యేయంగా మోదీ సుపరిపాలన
June 05, 2026 08:22 PM 13 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

చౌటుప్పల్‌లో బీజేపీ ఆధ్వర్యంలో మొక్కలు నాటే కార్యక్రమం

అట్టడుగు వర్గాల సంక్షేమమే ధ్యేయంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలో దేశంలో సుపరిపాలన సాగుతోందని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు డాక్టర్ కాసం వెంకటేశ్వర్లు, జిల్లా అధ్యక్షులు డాక్టర్ నాగం వర్షిత్ రెడ్డి కొనియాడారు. మోదీ 12 ఏళ్ల సుపరిపాలన ఉత్సవాలలో భాగంగా శుక్రవారం చౌటుప్పల్ మున్సిపాలిటీ పరిధిలోని 18వ వార్డులో మొక్కలు నాటే కార్యక్రమాన్ని వారు ప్రారంభించారు.​ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ప్రపంచంలోనే అత్యున్నత గౌరవం పొందిన నేత మోదీ అని, దేశ భద్రత, అభివృద్ధి కోసం ఆయన ఎన్నో కఠిన నిర్ణయాలను సుసాధ్యం చేశారని గుర్తుచేశారు. ప్రధాని పిలుపు మేరకు ప్రతి ఒక్కరూ తమ ఖాళీ స్థలాలు, వ్యవసాయ భూములలో తల్లి పేరుపై ఒక మొక్కను నాటాలని కోరారు. ఈ నెల 21 వరకు జరిగే సుపరిపాలన కార్యక్రమాల్లో యువత పెద్ద ఎత్తున పాల్గొనాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు దూడల భిక్షం గౌడ్, మున్సిపల్ అధ్యక్షులు కడారి కల్పన ఐలయ్య యాదవ్, రూరల్ అధ్యక్షులు కైరం కొండ అశోక్, 2 వ వార్డు కౌన్సిలర్ పోలపల్లి లక్ష్మీ ముత్తయ్య, 18 వ వార్డు కౌన్సిలర్ బుడ్డ సురేష్, జిల్లా నాయకులు రమణ గోని శంకరయ్య, బీజేవైఎం రాష్ట్ర కార్యదర్శి చింతకాయల ఝాన్సీ, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ 12 సంవత్సరాల సుపరిపాలన కార్యక్రమాల మున్సిపల్ కన్వీనర్ కడారి ఐలయ్య యాదవ్, రూరల్ కన్వీనర్ యాస అశోక్ రెడ్డి, దిండు భాస్కర్, ఊడుగు వెంకటేశం గౌడ్, పబ్బు వంశీ, వంగాల రమాకాంత్, గుర్రం రవీందర్, వరగంటి భాను, బొల్లమోని శ్రీశైలం, పర్ని శేఖర్ రెడ్డి, కొండల్, కానుగు శేఖర్, ఉష్కాగుల నాగరాజు, కాసోజు కనకాచారి, కాసోజు గోపి, తేలుకుంట్ల శ్రీధర్, గౌతమ్, సీనియర్ నాయకులు, బూత్ అధ్యక్ష కార్యదర్శులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News