Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
స్నేహానికి చావు లేదు! దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 05:55 PM

ఏబీవీపీ ఆధ్వర్యంలో చౌటుప్పల్‌లో విద్యాసంస్థల బంద్ సక్సెస్!

24-06-2026 43 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు స్వచ్ఛందంగా బంద్

కార్పొరేట్ విద్యాసంస్థలకు విద్యాశాఖ అధికారులు తొత్తులుగా మారారు: ఏబీవీపీ నాయకుడు బాతరాజు కార్తీక్

రాష్ట్రవ్యాప్తంగా పాఠశాలల బందుకు అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ (ఏబీవీపీ) రాష్ట్ర శాఖ పిలుపునిచ్చిన నేపథ్యంలో.. చౌటుప్పల్ శాఖ ఆధ్వర్యంలో మంగళవారం చేపట్టిన విద్యాసంస్థల బంద్ విజయవంతమైంది. చౌటుప్పల్ పట్టణ, మండల పరిధిలోని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు యాజమాన్యాలు స్వచ్ఛందంగా విద్యాసంస్థలను మూసివేసి బంద్‌కు మద్దతు ప్రకటించాయి.ఈ సందర్భంగా ఏబీవీపీ నాయకుడు బతరాజు కార్తీక్ మాట్లాడుతూ.. రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం సుమారు 12,000 ప్రభుత్వ పాఠశాలలను మూసివేసే దిశగా కుట్రపూరిత ప్రణాళికలు రచిస్తోందని మండిపడ్డారు. విద్యాశాఖ అధికారులు కార్పొరేట్ విద్యాసంస్థలకు తొత్తులుగా మారారని ధ్వజమెత్తారు.

​"రైట్ టు ఎడ్యుకేషన్ చట్టం ప్రకారం పేద విద్యార్థులకు అందించాల్సిన 25 శాతం ఉచిత విద్యను అందించకుండా ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాలు అధికారులను మేనేజ్ చేస్తున్నాయి. నిబంధనలకు విరుద్ధంగా స్కూళ్లలోనే బుక్స్, యూనిఫారాలు విక్రయిస్తూ పేద తల్లిదండ్రుల రక్తాన్ని పిండుతున్నారు. ప్రైవేట్ విద్యా మాఫియాగా తయారవుతున్న ఈ సంస్థలకు విద్యాశాఖ మంత్రి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మద్దతు పలుకుతున్నారా? దీనికి వారు సమాధానం చెప్పాలి."

​ప్రభుత్వం ఇప్పటికైనా తన వైఖరిని మార్చుకోకపోతే, రానున్న రోజుల్లో అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా మరింత ఉధృతంగా ఆందోళనలు చేపడతామని ఆయన హెచ్చరించారు.

​ఈ కార్యక్రమంలో ఏబీవీపీ నాయకులు దూసరి శివ సాయి, పల్చం రిత్విక్, అభి, కొత్త సాయి, నందగిరి ఆదిత్య తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

ఏబీవీపీ ఆధ్వర్యంలో చౌటుప్పల్‌లో విద్యాసంస్థల బంద్ సక్సెస్!

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News