Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
డివైఎఫ్ఐ రాష్ట్ర మహాసభలకు సన్నద్ధం కావాలి ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 15, 2026 04:55 PM

త్రిబుల్ ఐటీ విద్యార్థిని చికిత్సకు పూర్తి సహాయం అందించాలి: మహారెడ్డి భూపాల్ రెడ్డి

23-06-2026 44 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

బాసర త్రిబుల్ ఐటీలో విద్యనభ్యసిస్తున్న మనూర్ మండలం రాయిపల్లి గ్రామానికి చెందిన ఇస్మాయిల్ కుమార్తె అస్మిత ప్రమాదవశాత్తు భవనం పై నుంచి కిందపడటంతో తీవ్రంగా గాయపడి హైదరాబాద్‌లో చికిత్స పొందుతున్న విషయం తెలుసుకున్న నారాయణఖేడ్ మాజీ ఎమ్మెల్యే మహారెడ్డి భూపాల్ రెడ్డి ఆసుపత్రికి వెళ్లి ఆమెను పరామర్శించారు. విద్యార్థిని ఆరోగ్య పరిస్థితిని వైద్యులు, కుటుంబ సభ్యులను అడిగి తెలుసుకున్న ఆయన, నిరుపేద కుటుంబానికి చెందిన అస్మిత ఎంతో కష్టపడి చదివి త్రిబుల్ ఐటీలో సీటు సాధించిందని, అలాంటి విద్యార్థిని ప్రమాదానికి గురికావడం బాధాకరమని అన్నారు. ఆమెకు అవసరమైన పూర్తి వైద్య ఖర్చులను రాష్ట్ర ప్రభుత్వమే భరించాలని, కుటుంబం ఎదుర్కొంటున్న ఆర్థిక ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని ప్రత్యేక ఆర్థిక సహాయం అందించడంతో పాటు కుటుంబ సభ్యుల్లో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం కల్పించి ఆదుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అలాగే ప్రజా ప్రతినిధులు, అధికారులు స్పందించి అస్మితకు అత్యుత్తమ వైద్యం అందేలా చర్యలు తీసుకోవాలని కోరుతూ, ఈ క్లిష్ట సమయంలో బాధిత కుటుంబానికి అన్ని విధాలా అండగా ఉంటామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఫిరోజ్, కుటుంబ సభ్యులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొని అస్మిత త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.

Sthanikam

త్రిబుల్ ఐటీ విద్యార్థిని చికిత్సకు పూర్తి సహాయం అందించాలి: మహారెడ్డి భూపాల్ రెడ్డి

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News