Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
చేయూత పెన్షన్ దరఖాస్తుల గడువు సెప్టెంబర్ 15 వరకు పొడిగింపు- చైర్‌పర్సన్ పావని రమేష్ గౌడ్ “ఒక ఛాన్స్‌ ఉంది.. మాట్లాడి పరిష్కరించుకోండి” రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! శతాబ్దపు గణిత చిక్కుముడికి తెర.. పవన విద్యుత్‌కు కొత్త దిశ జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 01, 2026 08:18 AM

కుల మతాలకు అతీతంగా ఘనంగా మొహరం వేడుకలు

కుల మతాలకు అతీతంగా ఘనంగా మొహరం వేడుకలు

కుల మతాలకు అతీతంగా ఘనంగా మొహరం వేడుకలు
23-06-2026 152 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Biksham

అలం ఆటకు పోటెత్తిన భక్తజనం

సూర్యాపేట మున్సిపాలిటీ పరిధిలోని పిల్లలమర్రి గ్రామంలో కుల మతాలకు అతీతంగా మొహరం వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. హిందూ, ముస్లిం సోదరభావానికి ప్రతీకగా ప్రతి ఏడాది నిర్వహించే ఈ వేడుకల్లో ఈసారి కూడా గ్రామ ప్రజలు భారీ సంఖ్యలో పాల్గొంటున్నారు.

ముఖ్యంగా రాత్రి వేళ నిర్వహించే అలం ఆట ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. అలం ఆడే కార్యక్రమాన్ని తిలకించేందుకు పిల్లలమర్రి గ్రామం ప్రజలు పెద్ద ఎత్తున తరలివస్తున్నారు. డప్పుల మోగింపు, సంప్రదాయ వాయిద్యాల నడుమ అలం ఊరేగింపు భక్తి పారవశ్యాన్ని కలిగిస్తోంది.

గ్రామంలోని యువకులు, పెద్దలు, మహిళలు కలిసి మొహరం ఏర్పాట్లలో చురుకుగా పాల్గొంటున్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా నిర్వాహకులు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటున్నారు.

ఈ సందర్భంగా గ్రామ పెద్దలు మాట్లాడుతూ, మొహరం వేడుకలు మత సామరస్యానికి ప్రతీకగా నిలుస్తున్నాయని, అందరూ కలిసిమెలిసి పండుగను జరుపుకోవడం ఆనందదాయకమని తెలిపారు. పిల్లలమర్రిలో దశాబ్దాలుగా కొనసాగుతున్న ఈ సంప్రదాయం భవిష్యత్ తరాలకు ఆదర్శంగా నిలుస్తుందని పేర్కొన్నారు.

Sthanikam

కుల మతాలకు అతీతంగా ఘనంగా మొహరం వేడుకలు

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News