Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
కాంగ్రెస్ నేతల అరెస్టు అప్రజాస్వామికం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 12:26 PM

కుటుంబానికి తీరని లోటు.. ప్రభుత్వం ఆదుకోవాలి. కృష్ణయ్యకు మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య నివాళి.

23-06-2026 103 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

రామన్నపేట: ఓ కుటుంబానికి పెద్ద దిక్కుగా ఉన్న వ్యక్తి రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోవడంతో నిర్నెముల గ్రామం విషాదంలో మునిగిపోయింది. రామన్నపేట మండలంలోని నిర్నెముల గ్రామానికి చెందిన కన్నెబోయిన కృష్ణయ్య సోమవారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు.

మృతుడి భౌతిక దేహానికి మంగళవారం రామన్నపేట ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించి వారి దుఃఖంలో పాలుపంచుకున్నారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కృష్ణయ్య మృతి కుటుంబానికి తీరని లోటని, ఈ విషాద ఘటన ఎంతో బాధాకరమని పేర్కొన్నారు. బాధిత కుటుంబానికి ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా నిలిచి అవసరమైన సహాయ సహకారాలు అందించాలని కోరారు.

కృష్ణయ్య మృతితో కుటుంబ సభ్యులు, బంధువులు కన్నీరుమున్నీరుగా విలపించగా, ఆసుపత్రి ప్రాంగణం విషాద వాతావరణంలో మునిగిపోయింది. .

Sthanikam

కుటుంబానికి తీరని లోటు.. ప్రభుత్వం ఆదుకోవాలి. కృష్ణయ్యకు మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య నివాళి.

Article Image

రామన్నపేట: ఓ కుటుంబానికి పెద్ద దిక్కుగా ఉన్న వ్యక్తి రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోవడంతో నిర్నెముల గ్రామం విషాదంలో మునిగిపోయింది. రామన్నపేట మండలంలోని నిర్నెముల గ్రామానికి చెందిన కన్నెబోయిన కృష్ణయ్య సోమవారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు.

మృతుడి భౌతిక దేహానికి మంగళవారం రామన్నపేట ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించి వారి దుఃఖంలో పాలుపంచుకున్నారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కృష్ణయ్య మృతి కుటుంబానికి తీరని లోటని, ఈ విషాద ఘటన ఎంతో బాధాకరమని పేర్కొన్నారు. బాధిత కుటుంబానికి ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా నిలిచి అవసరమైన సహాయ సహకారాలు అందించాలని కోరారు.

కృష్ణయ్య మృతితో కుటుంబ సభ్యులు, బంధువులు కన్నీరుమున్నీరుగా విలపించగా, ఆసుపత్రి ప్రాంగణం విషాద వాతావరణంలో మునిగిపోయింది. .

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News