Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
కాంగ్రెస్ నేతల అరెస్టు అప్రజాస్వామికం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 12:23 PM

కేజీబీవీ పాఠశాలను తనిఖీ చేసిన కలెక్టర్ అనురాగ్ జయంతి.

23-06-2026 31 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

ఆత్మకూరు

విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు మెరుగైన వసతులు కల్పించేందుకు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి అధికారులను ఆదేశించారు. మంగళవారం ఆత్మకూరు మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయం (కేజీబీవీ)ను ఆమె ఆకస్మికంగా తనిఖీ చేశారు.

ఈ సందర్భంగా పాఠశాలలో కొత్తగా ఎన్ని అడ్మిషన్లు జరిగాయి, ప్రస్తుతం ఎంత మంది విద్యార్థులు చదువుతున్నారు, హాజరు శాతం ఎంత ఉందనే వివరాలను సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. గైర్హాజరైన విద్యార్థుల విషయంలో నిర్లక్ష్యం వహించకుండా తల్లిదండ్రులతో మాట్లాడి వెంటనే పాఠశాలకు హాజరయ్యేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. విద్యార్థుల హాజరు శాతాన్ని పెంచేందుకు ప్రత్యేక ప్రణాళిక రూపొందించాలని ఆదేశించారు.

అనంతరం పాఠశాలలో నిర్మాణంలో ఉన్న అదనపు తరగతి గదులను పరిశీలించారు. పెండింగ్‌లో ఉన్న పనులను వేగవంతం చేసి త్వరితగతిన పూర్తి చేయాలని సంబంధిత అధికారులకు సూచించారు.

మధ్యాహ్న భోజనాన్ని తనిఖీ చేసిన కలెక్టర్, మెనూ ప్రకారమే ఆహారం అందిస్తున్నారా లేదా పరిశీలించారు. విద్యార్థులకు నాణ్యమైన, పోషకాహారం అందించడంలో ఎలాంటి లోపాలు ఉండరాదన్నారు. కిచెన్, స్టోర్‌రూమ్‌లను పరిశీలించి పరిశుభ్రతకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలని సిబ్బందికి సూచించారు.

ఈ కార్యక్రమంలో సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.

Sthanikam

కేజీబీవీ పాఠశాలను తనిఖీ చేసిన కలెక్టర్ అనురాగ్ జయంతి.

Article Image

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News