Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
కాంగ్రెస్ నేతల అరెస్టు అప్రజాస్వామికం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 12:25 PM

ప్రీ–ప్రైమరీ స్కూళ్లను అంగన్వాడీ కేంద్రాలకే అప్పగించాలి ప్రభుత్వాలకు దాసరి పాండు డిమాండ్

23-06-2026 24 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

భువనగిరి, : అంగన్వాడీ వ్యవస్థను బలోపేతం చేయాల్సిన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు దానిని నిర్వీర్యం చేసే చర్యలకు పాల్పడుతున్నాయని తెలంగాణ అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ జిల్లా గౌరవ అధ్యక్షుడు దాసరి పాండు విమర్శించారు. ప్రీ–ప్రైమరీ స్కూళ్లను అంగన్వాడీ కేంద్రాలకు అప్పగించి, అంగన్వాడీ ఉద్యోగుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు.

సీఐటీయూ ఆధ్వర్యంలో మంగళవారం యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలోని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహం వద్ద వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా దాసరి పాండు మాట్లాడుతూ.. అంగన్వాడీ కేంద్రాలకు తగిన బడ్జెట్ కేటాయింపులు చేయకుండా ప్రభుత్వాలు ఇబ్బందులకు గురిచేస్తున్నాయని ఆరోపించారు.

హక్కుల అమలులో నిర్లక్ష్యం

రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ దేశ కార్మిక, ఉద్యోగ వర్గాలకు కల్పించిన హక్కులను నేటి ప్రభుత్వాలు అమలు చేయడంలో విఫలమవుతున్నాయని అన్నారు. అంగన్వాడీ కేంద్రాల్లో దశాబ్దాలుగా సేవలందిస్తున్న టీచర్లు, ఆయాల భవిష్యత్తును పట్టించుకోకుండా కొత్త విద్యా విధానం పేరుతో ప్రీ–ప్రైమరీ స్కూళ్లను ప్రవేశపెడుతున్నారని విమర్శించారు.

అంగన్వాడీల సేవలు మరువరానివి

గర్భిణులకు పౌష్టికాహారం అందించడం, చిన్నారులకు ప్రాథమిక విద్య బోధించడం, ప్రభుత్వానికి వివిధ రకాల సమాచారాన్ని అందించడం వంటి కీలక బాధ్యతలను అంగన్వాడీలు నిర్వహిస్తున్నారని తెలిపారు. అలాంటి ఉద్యోగుల పట్ల ప్రభుత్వం సానుకూల దృక్పథంతో వ్యవహరించాలని కోరారు.

అంగన్వాడీ కేంద్రాలను బలోపేతం చేసి, ప్రీ–ప్రైమరీ విద్య బాధ్యతలను వాటికే అప్పగించాలని దాసరి పాండు డిమాండ్ చేశారు.

ఈ కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు మాయ కృష్ణ, తెలంగాణ అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ జిల్లా కార్యదర్శి తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

ప్రీ–ప్రైమరీ స్కూళ్లను అంగన్వాడీ కేంద్రాలకే అప్పగించాలి ప్రభుత్వాలకు దాసరి పాండు డిమాండ్

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News