Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
కాంగ్రెస్ నేతల అరెస్టు అప్రజాస్వామికం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 12:24 PM

ముగ్దంపల్లిలో పనులు ప్రారంభించిన సర్పంచ్ శిగ నరేశ్ గౌడ్

23-06-2026 31 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

బీబీనగర్: గ్రామ ప్రజల భద్రతకు ప్రాధాన్యత ఇస్తూ ముగ్దంపల్లి గ్రామంలో సీసీ రోడ్ల ర్యాంపుల నిర్మాణ పనులను గ్రామ సర్పంచ్ శిగ నరేశ్ గౌడ్ ప్రారంభించారు. భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి సహకారంతో హెచ్‌ఎండీఏ నిధుల ద్వారా ఈ పనులు చేపట్టారు.

గ్రామంలో ప్రధాన సీసీ రోడ్ల నుంచి అంతర్గత వీధుల్లోకి వెళ్లేందుకు ర్యాంపులు లేకపోవడంతో పలువురు ప్రమాదాలకు గురవుతున్నారని గ్రామస్తులు ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లారు. దీంతో వెంటనే స్పందించిన ఎమ్మెల్యే నిధులు మంజూరు చేసి పనులు చేపట్టేలా ఆదేశించినట్లు సర్పంచ్ తెలిపారు.

మట్ట వెంకటేశం కిరాణా షాప్ నుంచి శక్తి రాములు ఇంటి వరకు, బీబీనగర్ రోడ్డు నుంచి ఫ్రెండ్స్ యూత్ భవనం వరకు, సిలువేరు దయాకర్ ఇంటి నుంచి రావిపహాడ్ రోడ్డు వరకు ర్యాంపుల నిర్మాణ పనులు ప్రారంభించారు. గ్రామంలో ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా పనిచేస్తున్నామని, ఎమ్మెల్యే సహకారంతో ముగ్దంపల్లిని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తామని శిగ నరేశ్ గౌడ్ పేర్కొన్నారు.

కార్యక్రమంలో ఉపసర్పంచ్ శెట్టి సోని మల్లేష్, పాదం రాధిక నర్సింగరావు, ఏంజాల వెంకటేష్, గోపికృష్ణ గౌడ్, ఎర్ర ప్రసన్న, శేఖర్ రెడ్డి, గోరుగంటి శంకర్, వడ్లకొండ బాలకృష్ణ, బండారు సురేష్, గ్రామ శాఖ అధ్యక్షుడు మట్ట గణేష్ గౌడ్, జిట్ట నర్సిరెడ్డి, ఆకుల శ్రీనురెడ్డి, పెరమండ్ల బాలరాజ్, రమేష్ తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

ముగ్దంపల్లిలో పనులు ప్రారంభించిన సర్పంచ్ శిగ నరేశ్ గౌడ్

Article Image

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News