Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మున్సిపల్ కార్మికుడి కుటుంబానికి రూ.10 వేల ఆర్థిక సాయం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 02:28 PM

పది ఫలితాల్లో మెరిసిన విద్యార్థులకు ఘన సన్మానం

23-06-2026 22 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Komidala Mahender reddy

వనిపాకల జెడ్పీ హైస్కూల్‌లో నగదు ప్రోత్సాహకాలు, పుస్తకాల బహుకరణ

చిట్యాల, జూన్ 23:

విద్యార్థులు భాషా నైపుణ్యాలను పెంపొందించుకుంటే అన్ని సబ్జెక్టుల్లోనూ రాణించగలరని రాష్ట్ర విద్యా పరిశోధన, శిక్షణ మండలి (ఎస్‌సీఈఆర్‌టీ) సభ్యుడు నన్నూరి ఉపేందర్ రెడ్డి పేర్కొన్నారు. చిట్యాల మండలం వనిపాకల గ్రామంలోని జెడ్పీ హైస్కూల్‌లో 2025–26 విద్యా సంవత్సరంలో పదో తరగతి ఉత్తీర్ణులైన విద్యార్థులకు సోమవారం ఘనంగా సన్మాన కార్యక్రమం నిర్వహించారు.

ఈ సందర్భంగా ప్రతి విద్యార్థికి రూ.2 వేల నగదు ప్రోత్సాహకాన్ని అందజేసి, శాలువాతో సత్కరించి పుస్తకాలను బహుమతిగా అందించారు. విద్యార్థులు తెలుగు, హిందీ, ఇంగ్లిష్ భాషల్లో అనర్గళంగా మాట్లాడే సామర్థ్యాన్ని పెంపొందించుకుంటే విద్యాభ్యాసంలో మరింత ఉన్నత ఫలితాలు సాధించవచ్చని ఉపేందర్ రెడ్డి సూచించారు.

కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయుడు శ్రీనయాచారి, గ్రామ సర్పంచ్ కొన్‌రెడ్డి మహిపాల్ రెడ్డి, ఉపసర్పంచ్ బద్దుల లింగస్వామి, అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ చైర్మన్, ఉపాధ్యాయులు, వార్డు సభ్యులు, గ్రామ పెద్దలు పాల్గొని విద్యార్థులను అభినందించారు. విద్యార్థుల విజయాలు గ్రామానికి గర్వకారణమని పలువురు పేర్కొన్నారు.

Sthanikam

పది ఫలితాల్లో మెరిసిన విద్యార్థులకు ఘన సన్మానం

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News