Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
జీవో 97ను వెంటనే రద్దు చేయాలి అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 25, 2026 03:09 AM

మరమ్మతుల కోసం ఎదురుచూస్తున్న పెద్దమంతూర్ వంతెన

23-06-2026 15 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Penukonda
EDIGA NAVEENKUMAR

శ్రీ సత్యసాయి జిల్లా రొద్దం మండలంలోని పెద్దమంతూర్ వంతెన అధ్వాన్న పరిస్థితికి చేరుకుంది. వంతెనపై చోటుచేసుకున్న భారీ గుంతలు వాహనదారులకు నిత్యం ప్రమాదకరంగా మారుతున్నాయి. ముఖ్యంగా ద్విచక్ర వాహనదారులు, ఆటో డ్రైవర్లు ఈ మార్గంలో ప్రయాణించేందుకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

వర్షాల కారణంగా వంతెనపై ఉన్న రహదారి మరింత దెబ్బతిని గుంతలు పెద్దవిగా మారాయి. రాత్రి సమయంలో గుంతలు కనిపించకపోవడంతో ప్రమాదాల ముప్పు పెరిగిందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే పలువురు వాహనదారులు గుంతల్లో పడడంతో స్వల్ప గాయాలపాలైన ఘటనలు చోటుచేసుకున్నాయని తెలిపారు.

ఈ వంతెన ద్వారా పెద్దమంతూర్‌తో పాటు పరిసర గ్రామాల ప్రజలు రాకపోకలు సాగిస్తుండటంతో సమస్య మరింత తీవ్రమైంది. సంబంధిత అధికారులు వెంటనే స్పందించి వంతెనకు మరమ్మతులు చేపట్టి ప్రజలకు సురక్షిత ప్రయాణ సౌకర్యం కల్పించాలని గ్రామస్థులు కోరుతున్నారు. వర్షాకాలం ప్రారంభమైన నేపథ్యంలో ప్రమాదాలు జరగకముందే చర్యలు తీసుకోవాలని వారు విజ్ఞప్తి చేస్తున్నారు.

Sthanikam

మరమ్మతుల కోసం ఎదురుచూస్తున్న పెద్దమంతూర్ వంతెన

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News