Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
కాంగ్రెస్ నేతల అరెస్టు అప్రజాస్వామికం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 12:26 PM

విద్యార్థి సమస్యలు పరిష్కరించకపోతే సీఎం పర్యటనను అడ్డుకుంటాం: డీఎస్‌ఎఫ్ హెచ్చరిక

23-06-2026 26 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

ఆదోని, : ఆదోని ప్రాంత ప్రజల చిరకాల ఆకాంక్ష అయిన ప్రత్యేక జిల్లా హోదాను ప్రభుత్వం వెంటనే ప్రకటించాలని డెమోక్రటిక్ స్టూడెంట్ ఫెడరేషన్ (డీఎస్‌ఎఫ్) నాయకులు డిమాండ్ చేశారు. ఆదోనిని జిల్లాగా ప్రకటించడంలో ప్రభుత్వం విఫలమైందని ఆరోపిస్తూ మంగళవారం స్థానిక ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో డీఎస్‌ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు ధనాపురం ఉదయ్, రాష్ట్ర కార్యదర్శి బాలు మాట్లాడారు.

విద్య, ఉపాధి, పరిపాలనా సౌలభ్యం, ప్రాంతీయ అభివృద్ధి కోసం ఆదోనిని జిల్లాగా ఏర్పాటు చేయాలని ప్రజలు ఎన్నో ఏళ్లుగా కోరుతున్నప్పటికీ ప్రభుత్వం ఇప్పటివరకు ఎలాంటి స్పష్టమైన నిర్ణయం తీసుకోలేదని వారు విమర్శించారు. ఆదోని ప్రాంత ప్రజల భావోద్వేగాలను, అవసరాలను ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు.

విద్యారంగ సమస్యలు పరిష్కరించాలి

కర్నూలు జిల్లాలో విద్యారంగానికి సంబంధించిన అనేక సమస్యలు పరిష్కారం కోసం ఎదురుచూస్తున్నాయని డీఎస్‌ఎఫ్ నాయకులు పేర్కొన్నారు. ముఖ్యంగా ప్రభుత్వ విద్యాసంస్థలు, హాస్టళ్లలో మౌలిక వసతుల కొరత తీవ్రంగా ఉందని తెలిపారు.

డీఎస్‌ఎఫ్ ప్రధాన డిమాండ్లు

ఆదోనిని ప్రత్యేక జిల్లాగా ప్రకటించాలి.

ఆదోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు సొంత స్థలం కేటాయించి భవనం నిర్మించాలి.

ఆరెకల్ సమీపంలోని మైనారిటీ డిగ్రీ కళాశాలలో వెంటనే అడ్మిషన్లు ప్రారంభించాలి.

ప్రభుత్వ హాస్టళ్లకు సొంత భవనాలు నిర్మించాలి.

సాంఘిక సంక్షేమ హాస్టళ్లలో నెలకొన్న సమస్యలను తక్షణమే పరిష్కరించాలి.

పరిష్కారం లేకుంటే ఉద్యమం తీవ్రం

ప్రజా సమస్యలు, విద్యార్థుల డిమాండ్లను ప్రభుత్వం వెంటనే పరిష్కరించకపోతే ఉద్యమాన్ని మరింత ఉద్ధృతం చేస్తామని డీఎస్‌ఎఫ్ నాయకులు హెచ్చరించారు. రేపు కర్నూలు జిల్లా తుగ్గలి మండలం జొన్నగిరి పర్యటనకు రానున్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి నిరసన తెలియజేస్తామని, అవసరమైతే డీఎస్‌ఎఫ్ ఆధ్వర్యంలో పర్యటనను అడ్డుకునే కార్యక్రమాలు చేపడతామని స్పష్టం చేశారు.

Sthanikam

విద్యార్థి సమస్యలు పరిష్కరించకపోతే సీఎం పర్యటనను అడ్డుకుంటాం: డీఎస్‌ఎఫ్ హెచ్చరిక

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News