Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
కాంగ్రెస్ నేతల అరెస్టు అప్రజాస్వామికం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 12:22 PM

విద్యార్థుల సమస్యలపై ఏబీవీపీ సమరశంఖం. పాఠశాలల బంద్‌కు విశేష స్పందన

23-06-2026 140 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

రామన్నపేట: విద్యార్థుల సమస్యల పరిష్కారం కోసం అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ (ఏబీవీపీ) సమరశంఖం పూరించింది. ప్రభుత్వం, విద్యాశాఖ అధికారుల దృష్టికి విద్యార్థుల సమస్యలను తీసుకెళ్లే క్రమంలో సోమవారం ZPHS లోయపల్లి, చాలెంజ్ ఐసీఎఫ్, శుభోదయం విద్యా మందిర్ పాఠశాలలను బంద్ చేయించి నిరసన కార్యక్రమం నిర్వహించింది.

విద్యార్థులకు నాణ్యమైన విద్య, మౌలిక వసతులు, మెరుగైన విద్యా వాతావరణం కల్పించాలని డిమాండ్ చేస్తూ ఏబీవీపీ నాయకులు ఆందోళన చేపట్టారు. విద్యార్థుల సమస్యలపై ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరి వీడాలని, వెంటనే పరిష్కార చర్యలు చేపట్టాలని కోరారు.

"విద్యార్థుల సమస్యలపై రాజీ లేదు.. విద్యార్థుల భవిష్యత్తే మా లక్ష్యం" అనే నినాదాలతో కార్యకర్తలు నిరసన వ్యక్తం చేశారు. విద్యార్థుల హక్కుల పరిరక్షణ కోసం పోరాటం కొనసాగుతుందని హెచ్చరించారు.

ఈ కార్యక్రమంలో ఏబీవీపీ నాయకులు చెరుకు జగదీష్ గౌడ్, మోర శ్రీకాంత్, బొడ్డుపల్లి ప్రకాష్, ఆంబోత్ రవి నాయక్, కారింగు శివ తదితరులు పాల్గొన్నారు

Sthanikam

విద్యార్థుల సమస్యలపై ఏబీవీపీ సమరశంఖం. పాఠశాలల బంద్‌కు విశేష స్పందన

Article Image

రామన్నపేట: విద్యార్థుల సమస్యల పరిష్కారం కోసం అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ (ఏబీవీపీ) సమరశంఖం పూరించింది. ప్రభుత్వం, విద్యాశాఖ అధికారుల దృష్టికి విద్యార్థుల సమస్యలను తీసుకెళ్లే క్రమంలో సోమవారం ZPHS లోయపల్లి, చాలెంజ్ ఐసీఎఫ్, శుభోదయం విద్యా మందిర్ పాఠశాలలను బంద్ చేయించి నిరసన కార్యక్రమం నిర్వహించింది.

విద్యార్థులకు నాణ్యమైన విద్య, మౌలిక వసతులు, మెరుగైన విద్యా వాతావరణం కల్పించాలని డిమాండ్ చేస్తూ ఏబీవీపీ నాయకులు ఆందోళన చేపట్టారు. విద్యార్థుల సమస్యలపై ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరి వీడాలని, వెంటనే పరిష్కార చర్యలు చేపట్టాలని కోరారు.

"విద్యార్థుల సమస్యలపై రాజీ లేదు.. విద్యార్థుల భవిష్యత్తే మా లక్ష్యం" అనే నినాదాలతో కార్యకర్తలు నిరసన వ్యక్తం చేశారు. విద్యార్థుల హక్కుల పరిరక్షణ కోసం పోరాటం కొనసాగుతుందని హెచ్చరించారు.

ఈ కార్యక్రమంలో ఏబీవీపీ నాయకులు చెరుకు జగదీష్ గౌడ్, మోర శ్రీకాంత్, బొడ్డుపల్లి ప్రకాష్, ఆంబోత్ రవి నాయక్, కారింగు శివ తదితరులు పాల్గొన్నారు

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News