Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
డివైఎఫ్ఐ రాష్ట్ర మహాసభలకు సన్నద్ధం కావాలి ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 15, 2026 04:02 PM

డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణంలో యువత భాగస్వామ్యం ముఖ్యం

23-06-2026 21 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Kodada Reporter
Harish reporter

- యువత వ్యసనాలకు గురికావద్దు.

- లక్ష్యం కోసం కృషి చేయాలి.

- గొప్ప వ్యక్తుల జీవితాలు ఆదర్శంగా, ఇన్స్పిరేషన్ గా తీసుకోవాలి.

- ఉన్నత లక్ష్యాలను ఎంచుకుని సాధన చేయాలి.

... సూర్యాపేట జిల్లా ఎస్పీ నరసింహ ఐపీఎస్

మాదకద్రవ్యాల దుర్వినియోగం, అక్రమ రవాణా నిర్మూలన అంతర్జాతీయ దినోత్సవం జూన్ 26 సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం, తెలంగాణ రాష్ట్ర పోలీస్ ఈగల్ ఫోర్స్ ఉత్తర్వుల మేరకు సూర్యాపేట జిల్లా పోలీసుల అధ్వర్యంలో వారం రోజుల పాటు డ్రగ్స్ నిర్మూలన అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో భాగంగా బుధవారం అనంతగిరి మండల పరిధి అనురాగ్ ఇంజనీరింగ్ కళాశాలలో విద్యార్థులకు డ్రగ్స్ నిర్మూలన పై పోలీసు ల ఆధ్వర్యంలో అవగాహన కల్పించి ఉజ్వల భవిష్యత్తుపై అనుసరించాల్సిన విధివిధానాల పట్ల చైతన్యపరిచారు.ఈ కార్యక్రమానికి సూర్యాపేట జిల్లా ఎస్పీ నరసింహ ముఖ్యఅతిథిగా హాజరై విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడారు..నేటి యువత దేశాభివృద్ధికి పాటుపడే వనరులుగా ఎదగాలని ఉన్నత లక్ష్యాలను ఎంచుకుని వాటి సాధనకై నిరంతరం కృషి చేయాలని కోరారు.గొప్ప వ్యక్తుల జీవితాలను ఆదర్శంగా, ఇన్స్పిరేషన్ గా తీసుకోవాలి, సమాజానికి ఉపయోగపడే వనరు కావాలి, ఇష్టం ఉన్న, నైపుణ్యం ఉన్న రంగంపై దృష్టి పెట్టాలి, గొప్ప శాస్త్రవేత్తలు, గొప్ప లీడర్స్ కావాలి అని ఎస్పి గారు విద్యార్ధులను చైతన్య పరిచారు. యువత, విద్యార్థులు దేశ సంపద, దేశ భవిష్యత్తు యువతపై ఆధారపడి ఉన్నది కావున విద్యార్థుల్లో, యువతలో మార్పు రావాలి, డ్రగ్స్ నిర్మూలన కోసం బాధ్యతగా ఉండాలి అని కోరారు.డ్రగ్స్ లాంటి చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలి, డ్రగ్స్ కు అలవాటుపడ్డ వారు నేరాలకు పాల్పడుతున్నారు, అనారోగ్యాలకు గురౌతున్నారు అన్నారు. జిల్లా వ్యాప్తంగా అన్ని కళాశాలలో యాంటీ డ్రస్ టీమ్స్ ఏర్పాటు చేశాము, విద్యాసంస్థల్లో ఈ టీమ్స్ డ్రగ్స్ నిర్మూలనకు పని చేయాలి, అధికారులకు సమాచారం అందించాలి అన్నారు. ఈ కార్యక్రమంలో డీఎస్సీ శ్రీనివాస్ రెడ్డి, మునగాల సర్కిల్ ఇన్స్పెక్టర్ రామకృష్ణా రెడ్డి, మేళ్లచెరువు ఎస్ఐ నవీన్ కుమార్, షి టీమ్ ఎస్ఐ మల్లేష్, కళాశాల ప్రిన్సిపాల్ డా.సురేష్ కుమార్, ఫార్మసీ ప్రిన్సిపాల్ ఏం.ఈశ్వరయ్య, వైస్ చైర్మన్ జైపాల్ రెడ్డి, ప్రసాద్, భూపతిరావు, ఉపాధ్యాయులు, విద్యార్థులు, పోలీసు సిబ్బంది ఉన్నారు.

Sthanikam

డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణంలో యువత భాగస్వామ్యం ముఖ్యం

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News