Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మొక్కలు నాటుతూ పర్యావరణ పరిరక్షణకు పిలుపు:గ్రామ సర్పంచ్ ప్రియాంక రాజేందర్ అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 26, 2026 06:46 AM

అంబేద్కర్ వర్సిటీలో అడ్మిషన్లకు గ్రీన్‌సిగ్నల్. డిగ్రీ, పీజీ కోర్సులకు దరఖాస్తుల ఆహ్వానం

23-06-2026 78 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

ఆగస్టు 7 వరకు నమోదు, ఫీజు చెల్లింపునకు అవకాశం

హైదరాబాద్: డా. బి.ఆర్. అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ (బ్రౌ) 2026-27 విద్యా సంవత్సరానికి డిగ్రీ, పీజీ, డిప్లొమా, సర్టిఫికెట్ కోర్సుల ప్రవేశాల నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. బీఏ, బీకాం, బీఎస్సీతో పాటు పలు ఎంఏ, ఎంకాం, ఎమ్మెస్సీ కోర్సుల్లో ప్రవేశాలు కల్పిస్తున్నట్లు విశ్వవిద్యాలయ అధికారులు తెలిపారు.

ఆన్‌లైన్‌లో రిజిస్ట్రేషన్, ఫీజు చెల్లింపునకు ఆగస్టు 7 చివరి తేదీగా నిర్ణయించారు. ఇంటర్మీడియట్ లేదా తత్సమాన అర్హత కలిగిన వారు డిగ్రీ కోర్సుల్లో ప్రవేశాలకు అర్హులని పేర్కొన్నారు. ప్రస్తుతం ద్వితీయ, తృతీయ సంవత్సరాల్లో చదువుతున్న విద్యార్థులు కూడా ఇదే గడువులోపు ట్యూషన్ ఫీజులు చెల్లించాలని సూచించారు.

విద్యార్హతలు, ఫీజు, ప్రవేశాల వివరాలను బ్రౌ అధికారిక వెబ్‌సైట్‌లో తెలుసుకోవచ్చని తెలిపారు. మరిన్ని వివరాలకు సమీప అధ్యయన కేంద్రం లేదా హెల్ప్‌డెస్క్‌ను సంప్రదించాలని సూచించారు.

Sthanikam

అంబేద్కర్ వర్సిటీలో అడ్మిషన్లకు గ్రీన్‌సిగ్నల్. డిగ్రీ, పీజీ కోర్సులకు దరఖాస్తుల ఆహ్వానం

Article Image

ఆగస్టు 7 వరకు నమోదు, ఫీజు చెల్లింపునకు అవకాశం

హైదరాబాద్: డా. బి.ఆర్. అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ (బ్రౌ) 2026-27 విద్యా సంవత్సరానికి డిగ్రీ, పీజీ, డిప్లొమా, సర్టిఫికెట్ కోర్సుల ప్రవేశాల నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. బీఏ, బీకాం, బీఎస్సీతో పాటు పలు ఎంఏ, ఎంకాం, ఎమ్మెస్సీ కోర్సుల్లో ప్రవేశాలు కల్పిస్తున్నట్లు విశ్వవిద్యాలయ అధికారులు తెలిపారు.

ఆన్‌లైన్‌లో రిజిస్ట్రేషన్, ఫీజు చెల్లింపునకు ఆగస్టు 7 చివరి తేదీగా నిర్ణయించారు. ఇంటర్మీడియట్ లేదా తత్సమాన అర్హత కలిగిన వారు డిగ్రీ కోర్సుల్లో ప్రవేశాలకు అర్హులని పేర్కొన్నారు. ప్రస్తుతం ద్వితీయ, తృతీయ సంవత్సరాల్లో చదువుతున్న విద్యార్థులు కూడా ఇదే గడువులోపు ట్యూషన్ ఫీజులు చెల్లించాలని సూచించారు.

విద్యార్హతలు, ఫీజు, ప్రవేశాల వివరాలను బ్రౌ అధికారిక వెబ్‌సైట్‌లో తెలుసుకోవచ్చని తెలిపారు. మరిన్ని వివరాలకు సమీప అధ్యయన కేంద్రం లేదా హెల్ప్‌డెస్క్‌ను సంప్రదించాలని సూచించారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News