Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
కాంగ్రెస్ నేతల అరెస్టు అప్రజాస్వామికం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 12:27 PM

రైతు సంరక్షణ కేంద్రంలో విత్తన మేళా పంటల సాగుపై అవగాహన సదస్సు

23-06-2026 24 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

నల్గొండ పట్టణ కేంద్రంలో

రైతులు ఆధునిక వ్యవసాయ పద్ధతులను అవలంబించి పంట మార్పిడి ద్వారా అధిక దిగుబడులు సాధించాలని మేయర్ బుర్ర చైతన్య శ్రీనివాస్ అన్నారు. రైతు సంరక్షణ కేంద్రంలో నిర్వహించిన విత్తన మేళా – పంటల సాగుపై అవగాహన సదస్సులో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు.

ఈ కార్యక్రమానికి అగ్రికల్చర్ ఆఫీసర్ శ్రీనివాస్ సభాధ్యక్షత వహించగా, హార్టికల్చర్ అసిస్టెంట్ డైరెక్టర్ అనంతరెడ్డి ఆధ్వర్యంలో సదస్సు నిర్వహించారు. రైతులకు పంటల ఎంపిక, పంట మార్పిడి, నాణ్యమైన విత్తనాల వినియోగం, నేల ఆరోగ్య పరిరక్షణ, ఎరువుల సమతుల్య వినియోగం, ఆధునిక సాగు పద్ధతులపై నిపుణులు అవగాహన కల్పించారు.

ఈ సందర్భంగా మేయర్ బుర్ర చైతన్య శ్రీనివాస్ మాట్లాడుతూ, ఒకే పంటను పదేపదే సాగు చేయడం వల్ల నేల సారవంతత తగ్గిపోతుందని, పంట మార్పిడి విధానాన్ని అనుసరించడం ద్వారా భూమి ఆరోగ్యం మెరుగుపడి రైతులకు అధిక లాభాలు చేకూరుతాయని తెలిపారు. రైతులు మార్కెట్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని ప్రత్యామ్నాయ పంటలను సాగు చేయాలని సూచించారు.

అగ్రికల్చర్ ఆఫీసర్ శ్రీనివాస్ మాట్లాడుతూ, శాస్త్రీయ వ్యవసాయ పద్ధతులు, ధృవీకరించిన విత్తనాల వినియోగం ద్వారా రైతులు మెరుగైన దిగుబడులు సాధించవచ్చని పేర్కొన్నారు. హార్టికల్చర్ అసిస్టెంట్ డైరెక్టర్ అనంతరెడ్డి మాట్లాడుతూ ఉద్యాన పంటల సాగు రైతులకు అదనపు ఆదాయ మార్గంగా నిలుస్తుందని వివరించారు.

విత్తన మేళాలో వివిధ రకాల నాణ్యమైన విత్తనాలు, వ్యవసాయ సాంకేతిక పరికరాలు, పంటల సంరక్షణకు సంబంధించిన ప్రదర్శనలు ఏర్పాటు చేసి రైతులకు వివరించారు.

ఈ కార్యక్రమంలో రైతు సంక్షేమ సంఘం అసిస్టెంట్ డైరెక్టర్ గిరి ప్రసాద్, హార్టికల్చర్ అసిస్టెంట్ డైరెక్టర్ అనంతరెడ్డి, రెండవ డివిజన్ కార్పొరేటర్ పెరిక యాదయ్య, పి.ఎస్.ఎస్ చైర్మన్ నాగరత్నం రాజు, మూడవ డివిజన్ కార్పొరేటర్ పేర్ల మల్లేశ్వరి అశోక్ చంద్ర, వ్యవసాయ శాఖ అధికారులు, ప్రజాప్రతినిధులు, రైతు నాయకులు మరియు పెద్ద సంఖ్యలో రైతులు పాల్గొన్నారు.

Sthanikam

రైతు సంరక్షణ కేంద్రంలో విత్తన మేళా పంటల సాగుపై అవగాహన సదస్సు

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News