Sthanikam - Truth Matters
Logo
Home / ప్రాంతీయ వార్తలు / సూర్యాపేట

ఘనంగా ఆసియన్ చెస్ చాంపియన్ మేకల అభినవ్ జయంతి.....

Updated : 23 Jun 2026 20:14 IST
As Preferred Source 1 min read
ఘనంగా ఆసియన్ చెస్ చాంపియన్ మేకల అభినవ్ జయంతి.....

సూర్యచంద్రులు ఉన్నంత వరకు క్రీడారంగంలో ఆసియన్ చెస్ చాంపియన్ మేకల అభినవ్ పేరు చిరస్మరణీయంగా నిలిచిపోతుందని కోదాడ మున్సిపల్ చైర్‌పర్సన్ ఎర్నేని కుసుమ వెంకటరత్నం బాబు పిసిసి డెలిగేట్ చింతకుంట్ల లక్ష్మీనారాయణ రెడ్డి, జిల్లా గ్రంథాలయ చైర్మన్ వంగవీటి రామారావు లు అన్నారు. మంగళవారం కోదాడ పట్టణంలోని స్థానిక బాలుర ఉన్నత పాఠశాల ఆవరణలో ఉన్న చెస్ చిచ్చరపిడుగు మేకల అభినవ్ 36వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. అభినవ్ విగ్రహానికి తల్లిదండ్రులు మేకల వెంకటేశ్వర్లు, అరుణలతో కలిసి

పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ

పాఠశాల స్థాయి నుంచి అంతర్జాతీయ స్థాయి వరకు అనేక విజయాలు సాధించి కోదాడ ఖ్యాతిని అభినవ్ ఖండాంతరాలకు వ్యాపింపజేశాడన్నారు. అతి పిన్న వయసులోనే ఆసియన్ చెస్ చాంపియన్‌షిప్ సాధించిన అభినవ్ రోడ్డు ప్రమాదంలో అకాల మృత్యువాత పడటం క్రీడారంగానికి తీరని లోటని ఆవేదన వ్యక్తం చేశారు. నేటి తరం క్రీడాకారులు అభినవ్ స్ఫూర్తితో రాణించి, ఆయన ఆశయాలను సాధించాలని పిలుపునిచ్చారు. అనంతరం పదో తరగతి ఫలితాల్లో ప్రభుత్వ పాఠశాలలో చదివి డివిజన్ స్థాయిలో ప్రతిభ కనబరిచిన ఒక పేద విద్యార్థికి అభినవ్ జ్ఞాపకార్థం నగదు ప్రోత్సాహక బహుమతిని అందజేశారు. దొంగరి శ్రీనివాసరావు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ దేవరపల్లి మల్లేశ్వరి, మాజీ సర్పంచ్ పారా సీతయ్య, ఎంఈఓ సలీం షరీఫ్, మార్కెట్ వైస్ చైర్మన్ షేక్ బషీర్, కౌన్సిలర్లు కందుల కోటేశ్వరరావు, గంధం పాండు, తోట శ్రీను, తూణం కృష్ణ, షేక్ నయీమ్ రావెళ్ల సీతారామయ్య, బొలిశెట్టి కృష్ణయ్య,రామినేని శ్రీనివాసరావు, సుందరి వెంకటేశ్వర్లు,బద్దం భద్రారెడ్డి, బొల్లు రాంబాబు, చంద్రశేఖర్, జగన్మోహన్ రావు,పంది తిరపయ్య, బాజాన్, పత్తిపాక జనార్దన్, రహీం, బుడిగం నాని సుందర్ బాబు శ్రీను, చందర్రావు, శోభన్ తదితరులు పాల్గొన్నారు....

Sthanikam

ఘనంగా ఆసియన్ చెస్ చాంపియన్ మేకల అభినవ్ జయంతి.....

Article Image

మరిన్ని

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Latest news