Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మున్సిపల్ కార్మికుడి కుటుంబానికి రూ.10 వేల ఆర్థిక సాయం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 02:25 PM

శ్రీ చైతన్య స్కూల్ ముందు ఎస్‌ఎఫ్‌ఐ ధర్నా

24-06-2026 215 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Komidala Mahender reddy

అధిక ఫీజుల వసూళ్లు నిలిపివేయాలని డిమాండ్

నార్కట్‌పల్లి, జూన్ 24: ప్రైవేట్ విద్యాసంస్థలు అధిక ఫీజుల పేరుతో విద్యార్థుల తల్లిదండ్రులపై ఆర్థిక భారం మోపుతున్నాయని ఆరోపిస్తూ ఎస్‌ఎఫ్‌ఐ ఆధ్వర్యంలో బుధవారం నార్కట్‌పల్లిలోని శ్రీ చైతన్య స్కూల్ ఎదుట ధర్నా నిర్వహించారు. విద్యను వ్యాపారంగా మార్చి ప్రతి ఏడాది ఫీజులను పెంచడాన్ని ఖండించారు.

ఫీజులతో పాటు పుస్తకాలు, యూనిఫాంలను బలవంతంగా కొనుగోలు చేయిస్తున్నారని ఆరోపిస్తూ, అధిక ఫీజుల వసూళ్లను వెంటనే నిలిపివేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ నిబంధనల మేరకే ఫీజులు వసూలు చేయాలని, ఈ వ్యవహారంపై విద్యాశాఖ అధికారులు విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని కోరారు.

లేనిపక్షంలో ఆందోళనలను మరింత ఉధృతం చేస్తామని ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు హెచ్చరించారు. కార్యక్రమంలో ఎస్‌ఎఫ్‌ఐ నకిరేకల్ డివిజన్ నాయకులు ఆరూరి ప్రణీత్, ముస్కు రవీందర్‌తో పాటు సంజయ్, శివప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

శ్రీ చైతన్య స్కూల్ ముందు ఎస్‌ఎఫ్‌ఐ ధర్నా

Article Image

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News