Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
కాంగ్రెస్ నేతల అరెస్టు అప్రజాస్వామికం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 01:29 PM

ఆలయ మార్గంపై మట్టి పోసి ఆక్రమణ? నిదానపల్లిలో భక్తుల ఆందోళన.

24-06-2026 291 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

భవిష్యత్తులో రోడ్డు విస్తరణకు అడ్డంకులు ఏర్పడే అవకాశం.

రామన్నపేట: యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండలం నిదానపల్లి గ్రామంలో ఉన్న శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి ఆలయానికి వెళ్లే బీటీ రహదారిపై ఆక్రమణల ముప్పు నెలకొంది. రహదారికి ఆనుకుని ఉన్న వ్యవసాయ భూమి యజమానులు పొలం మట్టిని భారీగా పోయడంతో రోడ్డు హద్దులు క్రమంగా కుదించుకుపోతున్నాయని స్థానికులు ఆరోపిస్తున్నారు.

ఆలయానికి వెళ్లే ప్రధాన మార్గంలోనే మట్టిని రోడ్డు అంచుల వరకు పోయడంతో వాహనాల రాకపోకలకు ఇబ్బందులు తలెత్తుతున్నాయి. వర్షాకాలంలో మట్టి రోడ్డుపైకి జారి ప్రమాదాలకు దారితీసే అవకాశం ఉందని గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

నిదానపల్లి గుట్టపై ఉన్న శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి ఆలయాన్ని అభివృద్ధి చేయాలని ప్రభుత్వం, ప్రజాప్రతినిధులు భావిస్తున్న తరుణంలో రహదారి విస్తరణ అవసరం ఏర్పడే అవకాశముంది. అయితే ప్రస్తుతం రోడ్డు హద్దుల వరకు మట్టిని పోయడం వల్ల భవిష్యత్తులో రోడ్డు వెడల్పు పనులకు ఆటంకం కలిగే పరిస్థితి ఏర్పడుతుందని స్థానికులు చెబుతున్నారు.

ఇప్పటికైనా సంబంధిత రెవెన్యూ, పంచాయతీరాజ్ అధికారులు స్పందించి రహదారి హద్దులను పరిశీలించి, రోడ్డు భూమిపై ఉన్న మట్టిని తొలగించి ప్రజా ప్రయోజనాలను కాపాడాలని గ్రామస్తులు కోరుతున్నారు.

Sthanikam

ఆలయ మార్గంపై మట్టి పోసి ఆక్రమణ? నిదానపల్లిలో భక్తుల ఆందోళన.

Article Image

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News