Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
కోదాడ హైదరాబాద్ పబ్లిక్ స్కూల్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 05:54 PM

గ్రామాల సమగ్ర అభివృద్ధే ధ్యేయం

గ్రామాల సమగ్ర అభివృద్ధే ధ్యేయం

గ్రామాల సమగ్ర అభివృద్ధే ధ్యేయం
24-06-2026 143 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

* రూ.15 లక్షలతో సీసీ రోడ్డు పనులకు శంకుస్థాపన

* ఏఎంసీ చైర్మన్ ఉబ్బు వెంకటయ్య, సర్పంచ్ జువ్వి నర్సింహ్మ

​గ్రామాల సమగ్ర అభివృద్ధే ధ్యేయంగా శక్తివంచన లేకుండా కృషి చేస్తామని చౌటుప్పల్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ ఉబ్బు వెంకటయ్య, సర్పంచ్ జువ్వి నర్సింహ్మ అన్నారు. చౌటుప్పల్ మండలం ధర్మోజిగూడెం గ్రామంలో ఉపాధి హామీ (ఎన్ఆర్ఇజిఎస్) నిధులు రూ.15 లక్షలతో చేపట్టనున్న సీసీ రోడ్డు నిర్మాణ పనులకు బుధవారం వారు ఘనంగా శంకుస్థాపన చేశారు.​ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ... ప్రాధాన్యత క్రమంలో అంచెలంచెలుగా గ్రామాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో ముందుకు నడిపిస్తామని స్పష్టం చేశారు.​అన్ని వర్గాల ప్రజలకు సముచిత స్థానం కల్పిస్తూ, సంక్షేమ ఫలాలు అందజేస్తున్న ఘనత కాంగ్రెస్ పార్టీకే సొంతం. ఇచ్చిన హామీ ప్రకారం ప్రతి ఇంటికీ సంక్షేమ పథకాలు అందజేస్తూ ప్రభుత్వం మాట నిలబెట్టుకుంది.​ఇల్లు లేని నిరుపేదలకు ఇందిరమ్మ ఇళ్లు, దశాబ్ద కాలంగా ఆగిపోయిన కుటుంబాలకు కొత్త రేషన్ కార్డులు అందజేయడంతో పాటు నిర్విరామంగా రేషన్ కార్డుల ప్రక్రియ చేపట్టడం కాంగ్రెస్ పార్టీ నిబద్ధతకు నిలువెత్తు నిదర్శనమని వారు పేర్కొన్నారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, 200 యూనిట్ల ఉచిత విద్యుత్, రేషన్ కార్డుదారులకు సన్న బియ్యం పంపిణీ వంటి పథకాలు విజయవంతంగా అందుతున్నాయని వివరించారు.​ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ పకీరు శ్రీనివాస్ రెడ్డి, వార్డు సభ్యులు ఊదరి శ్రీనివాస్, సామిడి సంధ్య, ఐతరాజు శారద లింగస్వామి, రాచకొండ భార్గవ్, జీడిముడ్ల శోభ, గునుగంటి వెంకటేశం, జంగం వెంకటమ్మ, మాజీ ఉప సర్పంచ్‌లు బత్తుల శ్రీహరి, కొంతం బుచ్చిరెడ్డి, బద్రి లింగయ్య, ఐతరాజు సత్తయ్య, రాచకొండ కృష్ణయ్య, సామిడి లింగారెడ్డి, ఊదరి లింగయ్య, రాచకొండ వెంకటేశం, ఊదరి స్వామి, గునుగంటి స్వామి, చెన్నోజు భూషణాచారి, బోనకుర్తి హరికృష్ణ, ఊదరి రవి, జంగం అంజయ్య, ఐతరాజు రవీందర్, బత్తుల సింహాచలం, కొంతం శ్రీనివాస్ రెడ్డి, మాజీ వార్డు సభ్యులు, కాలనీ వాసులు‌, గ్రామస్తులు, గ్రామ పంచాయతీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

గ్రామాల సమగ్ర అభివృద్ధే ధ్యేయం

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News